Sindh may return to India: సింద్.. ఒకప్పుడు అఖండ భారతంలో భాగం. సింధు లోయలోనే మన మానవ నాగరికత వెలిసిందని చరిత్ర చెబుతోంది. అయితే ఈ సింద్ ప్రాంతం.. స్వాతంత్య్రం తర్వాత జరిగిన దేశ విభజనతో పాకిస్తాన్‌లోకి వెళ్లింది. ఎనిమిది దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ సిం«ద్ ప్రాంతం త్వరలో భారత్‌లో కలవొచ్చు అని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్‌సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ హోల్డ్‌లో ఉంది. ఢిల్లీ ఎర్రకోట పేలుడు తర్వాత ఆపరేషన్ సిందూర్ 2.0 ప్రారంభమవుతుందన్న టెన్షన్ నెలకొంది. ఈ తరుణంలో రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీలో సింధి సమాజ్ నిర్వహించిన సభలో రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నాగరికత పరంగా సింధ్ ఎప్పటికీ భారతదేశానికి అనుబంధమైనదని పేర్కొన్నారు.
కేంద్రం వ్యూహాత్మక చర్యలు..
భారత ప్రభుత్వం తక్షణంగా సింధ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించే అవకాశాలు లేవు. కానీ సాంస్కృతిక, చారిత్రిక ధృక్పథంలో ఆ ప్రాంత ప్రజల హక్కులపై భారత్ ప్రత్యేక పట్టును ఉంచుతుంది. విభజన కాలంలో అనేక మంది సింధీ హిందువులు భారత్‌కు వలస వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం, అక్కడని ప్రజా ఉద్యమాల సందర్భంలో (స్వతంత్ర సింధ్ కోసం నిరసనలు, జై సింధ్ ఉద్యమం) భారత్ అంతర్జాతీయ మద్దతు ఇవ్వవచ్చు.
చరిత్ర, పరిణామాలు
సింధ్ ప్రావిన్స్ ప్రస్తుతానికి పాకిస్తాన్‌లో ఉంది. కరాచీ రాజధానిగా, మోహంజోదారో, హరప్ప వంటి ప్రాచీన నాగరికతలకు కేంద్రంగా నిలిచింది. దేశ విభజన సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా పాక్‌లో భాగమై, అక్కడని సింధీ హిందువులు ఇండియాకు వచ్చారు. అయినప్పటికీ, సింధ్ సంస్కృతి, సింధూ నది పవిత్రత భారతీయ చరిత్రలో ప్రాధాన్యతను కలిగి ఉంది. భారత ప్రభుత్వం అంతర్గతంగా సింధ్ మీద మానసిక అనుబంధంతోపాటు, సరిహద్దులు మారితే పార్లమెంటరీ, వ్యూహాత్మక పరంగా నూతన చర్యలకు సిద్ధంగా ఉంటుంది. అంతర్జాతీయ పరిణామాలు, ప్రజా ఉద్యమాల దిశ చూసుకుంటే, సింధ్ మీద రాజకీయ, మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, భౌగోళికంగా కష్టమే. భారత్ ప్రధానంగా ప్రాచీన నాగరికతల అంశాలను, సింధీ సాంస్కృతిక మూలాలను ప్రపంచం ముందు ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇవ్వొచ్చు.