https://oktelugu.com/

Kerala High Court: అనారోగ్యంతో భర్త.. సంతానం కోసం కోర్టుకు వెళ్లిన భార్య.. సంచలన తీర్పు ఇచ్చిన కేరళ హైకోర్టు!

సాంకేతిక విప్లవం అన్నిరంగాల్లో పెను మార్పులు తీసుకువస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్నిరంగాల్లో సాంకేతికత కీలకపాత్ర పోషిస్తోంది. ఇక వైద్య రంగంలో సాంకేతికత అనేక వ్యాధులకు చికిత్స లభిస్తోంది. మనిషి ఆయుష్సును మరింత పెంచుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 22, 2024 / 10:43 AM IST

    Kerala High Court

    Follow us on

    Kerala High Court: వైద్యరంగంలో సాంకేతిక విప్లవం.. ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. రోజు రోజుకూ మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల కారణంగా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. అనేక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. మనిషి ఆయుష్షును పెంచుతోంది. కొన ఊపిరితో ఉన్న వారికి కూడా ఊపిరి పోస్తోంది. ఇలాంటి మార్పును అందరూ స్వాగతిస్తున్నారు. ఇక అవయవాల మార్పిడిలోనూ సంచలనాలు నమోదవుతున్నాయి. అయితే సాంకేతికత కొన్ని దుష్పరిణామాలు కూడా జరుగుతున్నాయి. గర్భంలోనే బిడ్డలను చంపేస్తున్నారు. ఆబార్షన్లు చేస్తున్నారు. అదే విధంగా తల్లి గర్భం బయట కూడా అలాంటి వాతావరణం సృష్టించి బిడ్డను పెంచుతున్నారు. పిల్లలు లేని అనేక మందికి సంతాన యోగం కలిగిస్తున్నారు. ఇక భర్త చనిపోయిన తర్వాత కూడా పిల్లలు కనేలా టెన్నాలజీ అభివృద్ధి చెందింది.

    వీర్యం స్టోరేజీతో..
    తాజాగా సంతానం లేని ఓ దంపతులు పిల్లలను కనడానికి చేసిన అభ్యర్ధనకు కేరళ హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి అనుమతినిచ్చింది. కొద్ది కాలంగా తన భర్త తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తమకు ఇప్పటి వరకు సంతానం లేదని ఆమె పేర్కొంది. కాబట్టి భవిష్యత్తులో తాను సంతానాన్ని కనడానికి ఉపయోగపడేలా భర్త వీర్యాన్ని భద్రపరచడానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. భర్త పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అతడి రాతపూర్వక సమ్మతిని తీసుకురాలేకపోయానని పేర్కొంది. ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత దిగజారి అతడు మరణించే ప్రమాదముందని.. వెంటనే తమకు న్యాయం చేయాలని అభ్యర్థించింది. కాగా ఆ అభ్యర్ధనను స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ వీజీ.అరుణ్‌ ఆ దంపతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించారు. భర్త నుంచి వీర్యం సేకరించి, భద్రపరచడానికి కోర్టు అనుమతిచ్చింది. దానికి మినహా మరే ఇతర ప్రక్రియలు చేపట్టవద్దని ఆంక్షలు విధించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 9వ తేదీన చేపట్టనుంది.
    గతంలో భర్త చనిపోయాక బిడ్డ జననం..
    కోవిడ్‌ సమయంలో గుజరాత్‌ కోర్టు కూడా ఇలాగే అనుమతి ఇచ్చింది. తన భర్త కోవిడ్‌ తో బాధపడుతూ హాస్పిటల్‌ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని.. భర్త చనిపోయినా నేను అతని పిల్లలకు తల్లినవ్వాలని అనుకుంటున్నా..దయచేసి నా భర్త వీర్యాన్ని నాకు అందేలా చేయాలని ఓ యువతి గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ కోర్టును ఆశ్రయించింది. భర్త చనిపోయినా అతని ప్రతిరూపం కావాలనే ఆమె కోరికను ధర్మాసనం అంగీకరించింది. అనుమతినిచ్చింది. ఇది భారతీయ మహిళ ఆకాంక్ష. అటువంటిదే అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రంలో మరో మహిళ తన భర్త చనిపోయిన 14 నెలలకు పండండి బిడ్డకు జన్మనిచ్చింది. తన భర్త వీర్యంతో. ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటోంది.

    – ఓక్లహామాకు చెందిన షెలెన్‌ బెర్గర్‌ అనే టీచర్‌ తన భర్త వీర్యాన్ని భద్రపరిచి భర్త చనిపోయిన తరువాత ఆ వీర్యంతో గర్భం దాల్చింది. అలా గత మే నెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా భర్త కోరికతోనే. షెలెన్‌ బెర్గర్‌ కు 2018 సెప్టెంబర్‌లో స్కాట్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరూ ఒకరంటే మరొకరికి ప్రాణంగా ఉండేవారు. ముగ్గురు పిల్లల్ని కని సంతోషంగా జీవించాలని ఆశపడేవారు. అలా సంతోషంగా సాగిపోతున్న వారి సంసారంలో స్కాట్‌ కు వచ్చి గుండెపోటుతో విషాదం నెలకొంది. స్కాట్‌ హార్ట్‌ ఎటాక్‌తో ప్రాణాలు విడిచాడు. అంతే షెలెన్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భర్తను తలచుకుని పదే పదే విలపించేది. స్కాట్‌ కు హార్ట్‌ ఎటాక్‌ రావటంతో అతన్ని హాస్పిటల్‌ కు తరలించిన క్రమంలో అతను బత్రకటం కష్టమని డాక్టర్లు చెప్పగా..షెలెన్‌ తల్లడిల్లిపోయింది. భర్తతో పిల్లల్ని కనాలని ఆశపడింది. అదే ఆశ స్కాట్‌కు కూడా ఉంది. గతంలో కూడా స్కాట్‌కు ఓ సారి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో భద్రపరిచిన వీర్యం ద్వారా పిల్లల్ని కనాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఆరు నెలలకు స్కాట్‌ కు గుండెపోటు వచ్చి మరణించాడు. భర్త చనిపోయిన ఆరునెలలకు 40 ఏళ్ల షెలెన్‌ బార్బడోస్‌ ఫెర్టిలిటీ క్లినిక్‌ సహాయంతో భద్రపరిచిన పిండాల ద్వారా షెలెన్‌ భర్త మరనించిన నెలలకు బిడ్డకు జన్మనిచ్చింది.