Game Changer Trailer: సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవ్వరికి రాని ఒక అరుదైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. అలాగే రెండోవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరోగా కూడా ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేశాడు. అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నాయని చెప్పాలి. ఇలాంటి క్రమంలో ఆయన శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి వాటిని అందుకోవడానికి రామ్ చరణ్ విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి రామ్ చరణ్ కూడా ఉత్సాహపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు రీసెంట్ గా ఈ సినిమా గురించి స్పందిస్తూ ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలియజేసారు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని దసరా రోజు రిలీజ్ చేయాలనే ఆలోచనలు సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ట్రైలర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా కట్ చేయాలని శంకర్ అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడని కూడా దిల్ రాజు తెలియజేయడం విశేషము… ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అంటూ చాలా అంచనాలైతే పెంచుతున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో ఉంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ‘గేమ్ చేంజర్’ సినిమా మీద కూడా అంచనాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయనే చెప్పాలి. ఇక శంకర్ డైరెక్షన్ గాని, కథ గాని చాలా ఓల్డ్ టెంపులెట్ లో సాగుతుందని అందువల్లే ప్రేక్షకులు వాటిని అంగీకరించలేకపోతున్నారు అంటూ చాలా కథనాలైతే వెలుబడుతున్నాయి.
మరి వీటన్నింటికీ శంకర్ చెక్ పెడుతూ శంకర్ ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో మరోసారి స్టార్ హీరోగా వెలుగు పొందుతాడు… లేకపోతే మాత్రం మరోసారి ఆయన క్రేజ్ భారీగా పడిపోతుందనే చెప్పాలి. తన మార్కెట్ ని తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలంటే మాత్రం ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకమనే చెప్పాలి…