
ఎప్పుడూ నున్నటి షేవింగ్ తో నీట్ గా ఉండే మంత్రి కేటీఆర్ ఎందుకు గడ్డం, మీసాలు పెంచుకోరని ఆ మధ్య ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అంతేకాదు.. మార్ఫింగ్ చేసి కేటీఆర్ కు గడ్డం, మీసాలు అంటించి కేటీఆర్ కు ట్యాగ్ చేసి పంపించాడు. ఆ ఫొటో చూడముచ్చటగా ఉంది.
తాజాగా ఆ కోరికను కేటీఆర్ తీర్చేశారు. తాను గడ్డం, మీసాలతో ఎలా ఉంటానో స్పష్టంగా చూపించాడు. మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఏదో ఉద్యానవనంలో కేటీఆర్ విహరించాడు. అందులో ఓ సెల్పీని తీసుకొని వదిలాడు. అది వైరల్ గా మారింది.
మంత్రి కేటీఆర్ తొలిసారి తన గడ్డాన్ని, మీసాన్ని నెటిజన్లకు చూపించాడు. అందులో పూర్తిగా నెరిసిన తెల్లటి గడ్డం, మీసాలున్నాయి. తెల్లగా జుట్టు రంగు మారిపోవడం వల్లే కేటీఆర్ దాన్ని బయటపెట్టడం లేదని తెలుస్తోంది.
మంత్రి కేటీఆర్ ఎందుకు గడ్డం పెంచుకోరు అన్నదానికి సమాధానం దొరికింది. చిన్న వయసు కానీ ఆయన జుట్టు తెల్లబడిందని అర్తమవుతోంది. అందుకే గడ్డం, మీసాలు పెంచుకోకుండా షేవ్ చేసుకొని కనిపిస్తారని తెలుస్తోంది.
Many thanks all for the love ❤️ Feel very blessed
Tried to reply to as many as you could but to all those who I didn’t, please accept my wholehearted gratitude 🙏
Decided that since I am old now, will start flaunting my grey/silver hair once in a while 😎 pic.twitter.com/Hv9aN1DQwN
— KTR (@KTRBRS) July 24, 2021