https://oktelugu.com/

షర్మిల రిటర్న్.. గులాబీ నేతల్లో టెన్షన్..?

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడుతుదంటే.. ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టడం ఆషామాషీ కాదు.. పెట్టినోళ్లే.. గంగల పోయిండ్రు.. ఇప్పుడిక కొత్తవాళ్లు వచ్చి ఏం చేస్తారు.? మూడు రోజులకు ముల్లె.. మూట సదుర్కొని పోతారు.. అంటూ కేసీఆర్ కామెంట్ చేసిన మరుసటి రోజే.. వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంటూ తెరపైకి వచ్చారు. ఈ క్రమంలో గులాబీ పార్టీలో ఉన్న కొందరు అత్యుత్సహా లీడర్లు వెంటనే మైకుల […]

Written By: , Updated On : February 10, 2021 / 04:33 PM IST
Follow us on

YS Sharmila
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడుతుదంటే.. ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టడం ఆషామాషీ కాదు.. పెట్టినోళ్లే.. గంగల పోయిండ్రు.. ఇప్పుడిక కొత్తవాళ్లు వచ్చి ఏం చేస్తారు.? మూడు రోజులకు ముల్లె.. మూట సదుర్కొని పోతారు.. అంటూ కేసీఆర్ కామెంట్ చేసిన మరుసటి రోజే.. వైఎస్ షర్మిల కొత్త పార్టీ అంటూ తెరపైకి వచ్చారు. ఈ క్రమంలో గులాబీ పార్టీలో ఉన్న కొందరు అత్యుత్సహా లీడర్లు వెంటనే మైకుల ముందుకు వచ్చారు.

Also Read: గ్రేటర్ పీఠంపై కమలం కన్ను.. !

తమ గులాబీ రెక్కలు ఏడ ఊడిపోతాయో అన్న విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. షర్మిల మీటింగ్ జరుగుతున్న సమయంలోనే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తమ పార్టీని ఎవ్వరూ ఏం చేయలేరంటూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కడే నాయకుడని.. అంతకు మించిన నాయకుడు ఇంకా పుట్టలేదని టన్నుల్లో జోకేశారు. ఈయన మాటలకు మడుగులు ఒత్తుతూ.. టీఆర్ఎస్ సోషల్ మీడియా రంగంలో దిగింది. షర్మిల ఫొటోలకు చెప్పుల దండలు వేసిన పాత ఫొటోలను వైరల్ చేసింది.

అయితే సాయంత్రానికి అంతా మామూలైపోయింది. షర్మిల పార్టీపై ఎవరూ స్పందించవద్దని, నెగెటివ్ ప్రచారం చేయవద్దని వచ్చిన సంకేతాలతో అన్నింటినీ డిలీట్ చేసేశారు. షర్మిల పార్టీ ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? మరొకరి ప్రయోజనం కోసం ఇరత పార్టీల ప్రోద్భలంతో ముందుకు వస్తుందా..? అంటూ పొలిటికల్ గ్రౌండ్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం షర్మిల తమకోసం కేసీఆర్ వదలిన బాణమే అని చెప్పుకొచ్చింది.

Also Read: జగనన్న ‘బాణం’.. తిరగబడుతోందా..?

మరికొందరు మాత్రం దళిత క్రిస్టియర్, రెడ్డి, వైఎస్ అభిమానులను టీఆర్ఎస్ కు దూరం చేయడానికి బీజేపీ ప్రోత్సాహం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది.ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నా.. ప్రజల్లోకి వెళ్లడం లేదని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మొత్తంగా షర్మిల పార్టీపై కేసీఆర్ మౌనంగా ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే.. తాను స్పందించడం కారణంగా ఆ పార్టీకి అనవసరపు హైప్ వస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్