https://oktelugu.com/

సెన్సిబుల్ డైరెక్టర్ కి సెన్స్ లేదు.. నిర్మాతలు ఫైర్ !

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘శేఖర్ కమ్ముల’. బలమైన ఎమోషనల్ కథలతో మొదటి సినిమా నుండి మంచి పేరు తెచ్చుకున్నాడు శేఖర్. అందుకే ఆయన సినిమాల మేకింగ్ విషయంలో గాని, ఆయన కథల్లో గాని, హీరోలు నిర్మాతలు పెద్దగా ఇన్ వాల్వ్ అవ్వాలనుకోరు. నిజానికి శేఖర్ కమ్ములకి కథ చెప్పడం రాకపోయినా, ఆయన చెప్పింది అర్ధం కాకపోయినా బాగా తీస్తాడు అనే నమ్మకంతో కోట్లు ఖర్చు పెడతారు. పైగా ఫిదా […]

Written By:
  • admin
  • , Updated On : February 10, 2021 / 04:21 PM IST
    Follow us on


    తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘శేఖర్ కమ్ముల’. బలమైన ఎమోషనల్ కథలతో మొదటి సినిమా నుండి మంచి పేరు తెచ్చుకున్నాడు శేఖర్. అందుకే ఆయన సినిమాల మేకింగ్ విషయంలో గాని, ఆయన కథల్లో గాని, హీరోలు నిర్మాతలు పెద్దగా ఇన్ వాల్వ్ అవ్వాలనుకోరు. నిజానికి శేఖర్ కమ్ములకి కథ చెప్పడం రాకపోయినా, ఆయన చెప్పింది అర్ధం కాకపోయినా బాగా తీస్తాడు అనే నమ్మకంతో కోట్లు ఖర్చు పెడతారు. పైగా ఫిదా తరువాత సినిమా కాబట్టి, లవ్ స్టోరీ విషయంలో ఎవ్వరూ ఇన్ వాల్వ్ అవ్వలేదు.

    Also Read: తారక్ సిస్టర్ ను ఎప్పుడైనా చూశారా..? ఈమె అని మీకు తెలుసా?

    అయితే ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయి, సినిమా చూశాక, నిర్మాతలతో పాటు టీమ్ మెంబర్స్ కి కూడా ఎవ్వరికీ నచ్చలేదట. సినిమా మొత్తం మరీ స్లోగా సీరియల్ లాగా ఉందట. దాంతో నాగ్ సినిమా చూసి.. ఎక్కువగా మార్పులు చెప్పాడు. ఆ మార్పులు చేయడానికి శేఖర్ కమ్ముల రెడీగా లేడు. ఒకపక్క నిర్మాతలు నచ్చచెబుతున్నా.. వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదట శేఖర్ కమ్ముల, పైగా వాళ్లనే కన్విన్స్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాడట.

    Also Read: విజయ్-పూరి సర్ ప్రైజ్.. లైగర్ నుంచి అప్డేట్

    డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ విషయంలో శేఖర్ కమ్ములకు అసలు సెన్స్ లేదని, అతని పై వాళ్ళు సీరియస్ అవుతున్నారు. ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో, శేఖర్ ఎవరి అభిప్రాయాలు తీసుకునే పరిస్థితిలో లేడు. ఇక ఇప్పటికే లవ్ స్టోరీ విషయంలో చైతు బాగా అంసతృప్తిగా ఉన్నాడు. తన కంటే సాయిపల్లవి పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనేది చైతు వెర్షన్. చివరకు ఈ లవ్ స్టోరీ ఏమవుతుందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్