https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ తోనే ‘నిధి’కి బ్రేక్ !

హీరోయిన్ ‘నిధి అగ‌ర్వాల్’ పై ఇండస్ట్రీలో ఒక జోక్ ఉంది. ఆమెలో గొప్ప సేవా గుణం ఉందని.. కుర్రాళ్ళ కోసం కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తూ వారిని ఆనందపరచడానికి తన వంతు కృషి తాను సంపూర్ణంగా చేసుకుంటూ ముందుకు వెళ్తుందని ఆమె పై చాల జోక్స్ పేలుస్తూ ఉంటారు. నిజానికి నిధి కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది అనుకోండి. ఆమె క్యాజువల్ ఫొటోలను చూసినా ఆ విషయం మనకు అర్ధమైపోతుంది. అయినా ఎక్స్ పోజింగ్ చేయడానికి ఎందుకు […]

Written By:
  • admin
  • , Updated On : February 10, 2021 / 04:47 PM IST
    Follow us on


    హీరోయిన్ ‘నిధి అగ‌ర్వాల్’ పై ఇండస్ట్రీలో ఒక జోక్ ఉంది. ఆమెలో గొప్ప సేవా గుణం ఉందని.. కుర్రాళ్ళ కోసం కావాలని ఎక్స్ పోజింగ్ చేస్తూ వారిని ఆనందపరచడానికి తన వంతు కృషి తాను సంపూర్ణంగా చేసుకుంటూ ముందుకు వెళ్తుందని ఆమె పై చాల జోక్స్ పేలుస్తూ ఉంటారు. నిజానికి నిధి కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది అనుకోండి. ఆమె క్యాజువల్ ఫొటోలను చూసినా ఆ విషయం మనకు అర్ధమైపోతుంది. అయినా ఎక్స్ పోజింగ్ చేయడానికి ఎందుకు అంతగా ఉబలాటపడుతుంది అంటే.. అవకాశాల కోసమట.

    Also Read: సెన్సిబుల్ డైరెక్టర్ కి సెన్స్ లేదు.. నిర్మాతలు ఫైర్ !

    అందానికి నిధి లాంటి తనను సరిగ్గా వాడుకోవట్లేదని, తనకు సరైన అవకాశాలను ఇవ్వట్లేదని నిధి ఫీల్ అవుతుంది. అసలు నిధి అగ‌ర్వాల్ ని ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’లో పూరి చాల బాగా చూపించాడు. పైగా ఆ సినిమా సూపర్ హిట్ కూడా, అయినా నిధి అగ‌ర్వాల్ దిశ‌, ద‌శ‌ను మాత్రం ఆ సినిమా మార్చలేకపోయింది. అయినప్పటికీ ఎప్పుడూ నిరుత్సాహ‌ ప‌డ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్ లో కనిపిస్తూ ఛాన్స్ ల కోసం ఆశగా ఎదురుచూస్తూ వచ్చింది నిధి. ఆమె ఎదురుచూపులు ఫలించాయి, పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ పట్టింది.

    Also Read: తారక్ సిస్టర్ ను ఎప్పుడైనా చూశారా..? ఈమె అని మీకు తెలుసా?

    అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ కీలక పాత్ర అని, జస్ట్ గ్లామర్ కోసమే కాకుండా ఆమె క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నిధి కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆమె కెరీర్లోనే ఇది గోల్డెన్ సినిమా లాంటిది. పైగా పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా చేసాకా, కచ్చితంగా నిధి అగర్వాల్ కు మరిన్ని ఛాన్స్ లు వస్తాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఫస్ట్ హిట్ దక్కినా, పవన్ కళ్యాణ్ సినిమాతో నిధికి బ్రేక్ వచ్చేలా ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్