Homeజాతీయ వార్తలుYS Sharmila: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న షర్మిల..!

YS Sharmila: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న షర్మిల..!

YS Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తనయ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చెల్లి వైఎస్‌.షర్మిల. అన్నతో గొడవ పడి తెలంగాణలో రాజకీయాలు చేద్దామని వచ్చింది. పార్టీ పెట్టింది. రాజన్న రాజ్యం తెస్తానని, ఆదరించడంని సుమారు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. కానీ తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్‌లో చేరాలనుకుంది. పార్టీని విలీనం చేస్తానని వెళ్లింది. పలు దఫాలుగా చర్చలు కూడా జరిపింది. కానీ, షర్మిల అనుకున్నది ఒకటి. మరొకటి జరుగుతోంది. డీకే శివకుమార్‌ రాయబారం.. నేరుగా సోనియా, రాహుల్‌తో మంతనాలు కొనసాగాయి. కానీ, షర్మిల ప్రతిపాదనలకు ఆమోదం దక్కలేదు. కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం ఆలస్యంగా బోధపడిన షర్మిల ఇప్పుడు ఆ పార్టీతో విలీనానికి బ్రేక్‌ చెప్పారు. సొంతగా పోటీకి సిద్దమవుతున్నారు.

కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం..
కొద్ది నెలలుగా షర్మిల కాంగ్రెస్‌లో చేరి పోటీ చేయటం.. పార్టీ విలీనం పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ విలీనం ద్వారా తెలంగాణలో షర్మిలకు తగిన గుర్తింపు.. పాలేరు పోటీకి సీటు.. అనుచరలకు ప్రాధాన్యత అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో సహా మరి కొందరు తెలంగాణలో షర్మిలకు ప్రాధాన్యత వ్యతిరేకించారు. షర్మిలను ఏపీకి పరిమితం చేయాలని సూచన చేశారు. కానీ, షర్మిల తాను తెలంగాణలోనే పని చేస్తానని తేల్చి చెప్పారు. సోనియా, రాహుల్‌ తోనూ చర్చలు చేసారు. కానీ, ఫలితం రాలేదు.

కాంగ్రెస్‌ చెప్పినట్టే వినాలని..
షర్మిలకు తొలుత రాజ్యసభ ప్రతిపాదించారు. కాదంటే, ఫైనల్‌గా సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానం ఇస్తామనే చర్చ తెర మీదకు వచ్చింది. షర్మిల తనకు పాలేరు సీటు ఇవ్వాలని పట్టు బట్టారని తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్‌ నాయకత్వం నో చెప్పింది. షర్మిల అనుచర వర్గానికి సంబంధించి ఎటువంటి హామీ దక్కలేదు. సెప్టెంబర్‌ 30 వరకు కాంగ్రెస్‌కు షర్మిల డెడ్‌లైన్‌ విధించడంతో వ్యూహకర్త సునీల్‌ కొనుగోలు రంగంలోకి దిగి డీల్‌ ప్రతిపాదించారు. ఖమ్మం లోక్‌ సభ ప్రతిపాదించారు. దీంతో, రెండు రోజులుగా ఢిల్లీలోనే షర్మిల మకాం వేశారు. కానీ, కాంగ్రెస్‌ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో, కాంగ్రెస్‌తో విలీనం ప్రక్రియకు బ్రేక్‌ చెప్పారు. తన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. సొంతంగా పోటీకి నిర్ణయించినట్లు సమాచారం.

సింగిల్‌గానే బరిలో..
ఇక తెలంగాణ అసెంబ్లీ బరిలో షర్మిల సింగిల్‌గానే బరిలో దిగబోతున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన పాలేరు అసెంబ్లీ నుంచి షర్మిల బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీసు, వైఎస్సార్‌ విగ్రహాన్ని కూడా షర్మిల ప్రారంభించారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి బరిలోకి దిగనున్నారు. 119 నియోజకవర్గాల నుంచి పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపడానికి సన్నాహాలు ప్రారంభించారు.

చివరి నిమిషంలో కాంగ్రెస్‌ నుంచి సానుకూలంగా షర్మిల డిమాండ్ల పైన స్పందించి ముందుకు వస్తే మినహా వైఎస్సార్టీపీ ఎన్నికల్లో ఒంటరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఈ ఎన్నికల్లో తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్‌ ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...

YSR Congress: పార్టీకి డ్యామేజ్.. వైసీపీ సీనియర్ల ఆవేదన అదే!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే. ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు.. జాతీయస్థాయిలో జరుగుతున్న...

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
Oktelugu Epaper
Exit mobile version