Homeజాతీయ వార్తలుAnjani Kumar: కొత్త పోలీస్‌ బాస్‌ ఆయనే.. డీజీపీ పేరు ఖరారు చేసిన కేసీఆర్‌..!!

Anjani Kumar: కొత్త పోలీస్‌ బాస్‌ ఆయనే.. డీజీపీ పేరు ఖరారు చేసిన కేసీఆర్‌..!!

Anjani Kumar: తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఇస్తున్నంత ప్రాధాన్యం ఇతర ఏ శాఖలో ఉద్యోగులకు ఇవ్వడం లేదు. పోలీసులు అడక్కుండానే వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఇతర శాఖల ఉద్యోగులు సమ్మె చేసినా.. స్పందించరు. చూస్తాం.. చేస్తాం అంటూ హామీలు ఇస్తారు. అమలు సంగతి సరేసరి. ప్రభుత్వ శాఖల్లో కేసీఆర్‌కు ఇంతటి ప్రాధాన్యం ఉన్న పోలీస్‌ శాకకు కొత్త బాస్‌ నియామకానికి సమయం ఆసన్నమైంది. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1986 బ్యాచ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఆయన. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ కేడర్‌కు వెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్, గుంటూరు, బెల్లంపల్లిల్లో అసిస్టెంట్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. అనంతరం నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా అపాయింట్‌ అయ్యారు.

Anjani Kumar
Anjani Kumar KCR

ఐదేళ్లుగా ఆయనే బాస్‌..
1995లో హైదరాబాద్‌ తూర్పు జోన్‌ డీసీపీగా, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఫ్యాకల్టీగా వ్యవహరించారు మహేందర్‌రెడ్డి. అనంతరం ఇంటెలీజెన్స్‌ చీఫ్, గ్రేహౌండ్స్‌ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. 2017 నవంబర్‌లో ఇన్‌చార్జి్జ డీజీపీగా బాధ్యతలను స్వీకరించారు. 2018 ఏప్రిల్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అయ్యారు. నాటి నుంచి ఆయనే బాస్‌.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన పోలీస్‌ బాస్‌ లేరనేది పోలీస్‌ వర్గాల టాక్‌.

తర్వాతి బాస్‌ అంజనీకుమార్‌..
ఈనెలాఖరుతో మహేందర్‌రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికోసం మూడు పేర్లను తెలంగాణ ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. 1990 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి అంజనీ కుమార్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీగానూ సేవలను అందించారు.

రేసులో.. రవిగుప్తా కూడా..
గతంలో మహేందర్‌రెడ్డి రెండు వారాలపాటు మెడికల్‌ లీవ్‌లో ఉన్నప్పుడు అంజనీకుమార్‌ ఇన్‌చార్జి డీజీపీగా పని చేయడం ఆయనకు కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. అయితే 1990 బ్యాచ్‌కే చెందిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవిగుప్తా కూడా రేసులో ఉన్నారని సమాచారం. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తోన్నారు.

Anjani Kumar
Anjani Kumar

పరిశీలనలో ఉమేశ్‌ షరాఫ్‌ పేరు..
స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తోన్న 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఉమే‹శ్‌ షరాఫ్‌ పేరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉమేశ్‌ షరాఫ్‌ మరో ఆరు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు.

అంజనీకుమార్‌వైపే సీఎం మొగ్గు..
ముగ్గురు పోలీస్‌ బాస్‌ రేసులో ఉన్నప్పటికీ.. సీఎం కేసీఆర్‌ మాత్రం అంజనీకుమార్‌వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఈమేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఫైల్‌ తయారుచేసి సీఎం పేషీకి పంపినట్లు తెలిసింది. మహేందర్‌రెడ్డి ఉద్యోగగ విరమణ తరువాత ఇన్‌చార్జి డీజీపీగా అంజనీకుమార్‌ను అపాయింట్‌ చేసి.. కొద్ది రోజుల తరువాత ఆయనను పర్మినెంట్‌ చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version