spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ ఆ రెండూ మానేస్తేనే బెటర్

Jagan: జగన్ ఆ రెండూ మానేస్తేనే బెటర్

Jagan: ఒక్కోసారి దూకుడు రాజకీయంగా కలిసి వస్తోంది. ఇంకొన్ని సార్లు కోలుకోలేని దెబ్బతీస్తుంది. అయితే ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ ఎంత ఉపకరిస్తుందో.. వ్యూహాలు కూడా అంతే బాగా వర్కవుట్ అవుతాయి. గత ఎన్నికల్లో జగన్ కు పోల్ మేనేజ్ మెంట్ నుంచి వ్యూహాల వరకూ అన్నీ ఫలించాయి. అంతులేని విజయాన్ని కట్టబెట్టాయి. గత ఎన్నికలను పరిశీలిస్తే మాత్రం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగినట్టు తెలుస్తుంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సర్కారు నుంచి మంచి సపోర్టు లభించింది. అటు చంద్రబాబుపై కోపంతో బీజేపీ ‘వ్యవస్థ’పరంగా హెల్ప్ చేసింది. ఆపై రాష్ట్రంలో ఉన్న అన్నివర్గాలు సహకరించాయి. దీంతో జగన్ పార్టీకి కనివినీ ఎరుగని రీతిలో మెజార్టీ దక్కింది. అయితే గత ఎన్నికలకు ముందున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అంటే లేవని చెప్పాలి. వాటని జగనే ఏరికోరి దూరం చేసుకుంటున్నారు. ఒక రెండు అంశాలు జగన్ కు మైనస్ గా మారాయి. వాటిని మాత్రం ఆయన మార్చుకోకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో భారీ దెబ్బ తగిలే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Jagan
Jagan

గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేసింది. పార్టీకి సంస్థాగత నిర్మాణం తక్కువ. లక్షలాది మంది అభిమాన గణం ఉన్నా.. వారిని సమన్వయం చేసి పోలింగ్ బూత్ లకు తీసుకువెళ్లే యంత్రాంగం లేకుండా పోయింది. అయినా సరే చెప్పుకోదగ్గ ఓట్లను ఆ పార్టీ సొంతం చేసుకుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే నాడు పవన్ ను అభిమానించే వారు సైతం వైసీపీకి ఓటు వేయడం. పవన్ జనసేన తరుపున నిలబెట్టిన క్యాండిడేట్లు కొత్తవారు కావడం, పైగా వైసీపీ దూకుడు మీద ఉండడం, నాటి చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో పవన్ అభిమానులు చాలా మంది వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఇలా గత ఎన్నికల్లో ఓటువేసిన చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు. పైగా సీఎం జగన్ నుంచి కింది స్థాయి నేతల వరకూ పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల సీఎం జగన్ పవన్ వివాహ జీవితంపై మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు. వారంతా ఇప్పుడు జనసేనకు పూర్తిస్థాయిలో పోలరైజ్ అవుతున్నారు.

Jagan
Jagan

బలమైన సిద్ధాంతాలను పునాదిగా చేసుకుంది భారతీయ జనతా పార్టీ. హిందుత్వంతో పాటు కొన్ని సైద్ధాంతిక విధానాలను తప్పకుండా పాటిస్తుంది. అందుకే రెండు స్థానాలున్న జనసంఘ్.. ఇప్పుడు బీజేపీగా సుపరిచితమై అశేష భారతావనిని విస్తరించింది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు వ్యవహార శైలితో బీజేపీ వైసీపీకి అన్నివిధాలా సహకరించింది. అప్పటికే చంద్రబాబు చర్యలతో పార్టీ కోలుకోలేని దెబ్బతిని ఉంది. పార్టీకి మిగిలిన కొద్దిపాటి ఓట్లు సైతం వైసీపీకే మళ్లించింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ వ్యవహార శైలి బీజేపీ శ్రేణులకు నచ్చడం లేదు. వ్యవస్థాగత విమర్శలన్నదే బీజేపీ అభిమతం. వ్యక్తిగత కామెంట్స్ కూ ఆ పార్టీ దూరం. కానీ వైసీపీ మాత్రం వ్యక్తిగత ఎదురుదాడినే అస్త్రాలుగా చేసుకుంది. పైగా వయసు, ఇతరత్రా గౌరవాలు చూడకుండా.. చిన్నాపెద్ద తేడాల లేకుండా వైసీపీ నేతలు విమర్శలకు దిగుతుంటారు. ఇది బీజేపీ శ్రేణులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. దీని వెనుక జగన్ ప్రోత్సాహం ఉందని నమ్ముతున్న కాషాయ దళం.. నాడు చంద్రబాబుపై చూపిన ఆగ్రహం.. ఇప్పుడు జగన్ పై చూపడం ప్రారంభించారు. అటు పవన్ పై వ్యక్తిగత దాడిని కూడా మిత్రపక్షంగా బీజేపీకి రుచించడం లేదు. సో ఈ రెండు అంశాలు జగన్ సర్కారుకు చేటు తెస్తాయన్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper
Exit mobile version