అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివాదాల ప్రెసిడెంట్‌గా నిలిచిపోయారు డోనాల్డ్ ట్రంప్. తాను పదవి నుంచి దిగేపోయే వరకూ కూడా వివాదాల సుడిగుండంలోనే ఉండిపోయారు. చివరకు ఆయనపై అభిశంసన పెట్టే వరకూ పరిస్థితి వెళ్లిందంటే ఆయనపై ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు. తాను పదవి నుంచి దిగిన తర్వాత కూడా రాజకీయం తన చుట్టూ తిరిగేలా చేసుకుంటున్నారు. ఆయన్ను అభిశంసించాలని
Also Read: సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్… భారత్ చైనా సైనికుల మధ్య గొడవ.. పలువురికి గాయలు
అభిశంసన లక్ష్యం పదవి నుంచి దింపటమే అయినప్పుడు.. ఇప్పటికే పదవి నుంచి దిగిపోయిన ట్రంప్ మీద అభిశంసన చేసి సాధించేదేమిటి? అన్న సూటి ప్రశ్న ఎదురవుతోంది. ట్రంప్‌పై రెండో దఫా అభిశంసనను తీవ్రంగా తప్పుపడుతున్నారు రిపబ్లికన్లు. ఈ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని 45 మంది సెనేటర్లు తేల్చి చెప్పారు. ట్రంప్ మద్దతుదారులు హింసకు.. హేట్ స్పీచ్‌కు పాల్పడటానికి కారణమని డెమొక్రాట్లు చెప్పటాన్ని వారు తప్పు పడుతున్నారు. ట్రంప్‌పై తీర్మానం మతిమాలిన చర్యగా అభివర్ణిస్తున్న వారు లేకపోలేదు. ట్రంప్‌పై రెండో దఫా అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా మెజార్టీ రిపబ్లికన్ సెనేటర్లు ఓటు వేశారు.
Also Read: ఎంజాయ్ చేస్తున్న ట్రంప్… వీడియో వైరల్..
ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నేతలకు భిన్నంగా ఐదుగురు రిపబ్లికన్ నేతలు మాత్రం డెమొక్రాట్ల వాదనను ఏకీభవిస్తున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న ట్రంప్‌ను అభిశసించటం ద్వారా వచ్చేది ఏమిటన్న రిపబ్లికన్ నేతల మాటలో వాస్తవం కొంత ఉందని చెప్పక తప్పదు. ఇప్పటికే పదవి నుంచి దిగిపోయిన ట్రంప్‌ను అభిశంసించే కన్నా.. ఒక సామాన్య పౌరుడి హోదాలో ఆయనపై నేరారోపణను తీసుకురావటం బాగుంటుంది. అయితే.. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య ఉన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో పొలిటికల్ మైలేజీ కోసం డెమొక్రాట్లు ఇలాంటివి చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
ఈ వాదనకు బలం చేకూరేలా రిపబ్లికన్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే పదవిని కోల్పోయిన వ్యక్తిని ఎలా అభిశంసిస్తారు? ఇదంతా డెమొక్రాట్ల పబ్లిసిటీ స్టంట్. ఈ ప్రయత్నం అగ్గినిరాజేసినట్లే అవుతుందని సెనేటర్ రూబియో తప్పు పడుతున్నారు. సెనేట్లో ట్రంప్ ను అభిశంసిచాలంటే ఇప్పుడున్న 55 ఓట్లకు అదనంగా మరో 17 మంది రిపబ్లికన్ సెనేటర్ల మద్దతు అవసరం. ఆ అవకాశం తక్కువగా కనిపిస్తుంది.పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాన్ని రిపబ్లికన్లు ఇవ్వరని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అభిశంసన తీర్మానం నెగ్గటానికి మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం. అయితే.. సాధారణ మెజార్టీతో అభిశంసన ట్రయల్ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుంది. ట్రంప్‌ను అభిశంచాలంటే మాత్రం భారీ మెజార్టీ అవసరం. అది డెమొక్రాట్లకు లేదు. దీంతో ఇప్పటికే ట్రంప్ కారణంగా పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని భావిస్తున్న రిపబ్లికన్లు.. ట్రంప్ అభిశంసనకు మద్దతు ఇచ్చి.. అధికార పార్టీకి మేలు చేయటానికి వారు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి.