పంచాయితీకి సై.. టీడీపీ మేనిఫెస్టో విడుదల

ఏపీలో పంచాయితీ ఎన్నికలను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికార పార్టీకి షాకిస్తూ.. ప్రజలకు వరాలు కురిపిస్తూ ఏకంగా టీడీపీ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. జలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చంద్రబాబు తెలిపారు. ‘పల్లె ప్రగతి -పంచ సూత్రాలు’ పేరిట తెలుగుదేశం పార్టీ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పంచాయితీ ఎన్నికల్లో గెలిపిస్తే ఉచితంగా రక్షిత మంచినీరు ఇస్తామని ప్రజలకు పెద్ద హామీ ఇచ్చింది. ఆస్తిపన్ను […]

Written By: NARESH, Updated On : January 28, 2021 2:53 pm
Follow us on

ఏపీలో పంచాయితీ ఎన్నికలను కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికార పార్టీకి షాకిస్తూ.. ప్రజలకు వరాలు కురిపిస్తూ ఏకంగా టీడీపీ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. జలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చంద్రబాబు తెలిపారు.

‘పల్లె ప్రగతి -పంచ సూత్రాలు’ పేరిట తెలుగుదేశం పార్టీ పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. పంచాయితీ ఎన్నికల్లో గెలిపిస్తే ఉచితంగా రక్షిత మంచినీరు ఇస్తామని ప్రజలకు పెద్ద హామీ ఇచ్చింది. ఆస్తిపన్ను తగ్గించి పౌరసేవలు అందించడం.. ఇక శాంతిభద్రతల నిర్వహణ.. ఆలయాలపై దాడులు అరికట్టడం.. ప్రజల ఆస్తులకు భద్రత, స్వయం సంవృద్ధి .. వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకుంటామని హామీనిచ్చింది. స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని టీడీపీ అధినేత ప్రజలకు హామీలు కురిపించారు.

వైసీపీ నేతలు నిధుల కోసం ఏకగ్రీవాలు చేస్తున్నారని.. నిధులను దోచుకునేందుకే ఈ ప్లాన్ వేశారని ఏకగ్రీవాలపై చంద్రబాబు మండిపడ్డారు. గద్దల్లా వాలిపోయి దోచేయాలని చూస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2014లో 2.6శాతం ఏకగ్రీవమైతే.. 2020లో 20శాతంకు పైగా ఎలా ఏకగ్రీవాలు చేశారని ప్రశ్నించారు. వైసీపీ ఏకగ్రీవాల పేరుతో గ్రామాల్లో దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికలకు సిద్ధం కాకముందే.. బీజేపీ-జనసేన కూటమి ఇంకా అభ్యర్థుల వేటలో ఉండగానే చంద్రబాబు అలెర్ట్ అయ్యి ఏకంగా టీడీపీ తరుఫున మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అభ్యర్థులను గ్రామాల్లో సిద్ధం చేసినట్టు సమాచారం. చంద్రబాబు స్పీడు మామూలుగా లేదని నేతలు అంటున్నారు.