Power Crisis: సంప్రదాయ ఇంధన వనరులు తగ్గిపోతున్నాయి. విచ్చలవిడి వినియోగంతో అవి కనుమరుగవుతున్నాయి. దీంతో భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు వనరులు కనుమరుగైపోయిన క్రమంలో రేపో మాపో బొగ్గు నిల్వలు కూడా అదే విధంగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మానవాళి మనుగడపై పెను ప్రభావం కనిపించే అవకాశాలున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని నేతలు ప్రధాని మోడీని కోరుతున్నా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు.

దేశవ్యాప్తంగా విద్యుత్పత్తి చేసే కేంద్రాల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్ల వాటా 70 శాతం. వీటిలో ఇప్పటికే 16 ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అయిపోయి మూతపడ్డాయి. 16,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో భవిష్యత్ లో విద్యుత్ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆశించిన మేర బొగ్గు సరఫరా జరగకపోతే ప్లాంట్లు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో బొగ్గు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. బొగ్గుధరల పెరుగుదల కారణంగా దేశీయ బొగ్గు ఉత్పత్తిపై ఆధారపడటంతో సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో భారత్, చైనా దేశాలపైనే ప్రభావం పడుతోంది. కొద్దిరోజుల్లో విద్యుత్ సంక్షోభం తప్పకపోవచ్చని తెలుస్తోంది.
బొగ్గు సరఫరా చేస్తున్న మైనింగ్ సంస్థలకు మన జెన్ కో రూ.1500 కోట్ల బకాయిలు చెల్లించాలి. బొగ్గు కొరత కారణంగా ఏర్పడే పరిస్థితులపై సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. విద్యుత్ సంక్షోభం రాకుండా చూసే క్రమంలో సహకారం అందించాలని కోరారు. తెలంగాణలో సింగరేణి ఉండటంతో పెద్దగా ప్రభావం కనిపించకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బొగ్గు సంక్షోభంపై ప్రభుత్వాలు ఏ మేరకు చర్యలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.