I-T Dept Recruitment 2021: ఆదాయపు పన్ను శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 21 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను ఈ సంస్థ విడుదల చేసింది. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.

2021 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. 2021 సంవత్సరం నవంబర్ 15 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://incometaxindia.gov.in/pages/default.aspx వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ లో పొందుపరిచిన వాట్స్ న్యూ అనే ఆప్షన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను డిప్యూటీ కమిషనర్, సీఆర్ బిల్డింగ్, న్యూఢిల్లీ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 5 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నియామకం జరగనుంది. 8000 kdph డేటా ఎంట్రీ స్పీడ్ ను కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -2 కోసం 5 ఉద్యోగ ఖాళీలు ఉండగా నిమిషానికి 50 పదాల వేగంతో ఇంగ్లీష్ టైప్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్‌లో ట్రాన్స్‌క్రిప్షన్ వేగంతో నిమిషానికి 65 పదాలు కలిగి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి.