Siddharth Reveals His Tweet: గతంలో సమంత, సిద్దార్థ్ మధ్య లవ్ ట్రాక్ ఉందని రూమర్ల వచ్చాయి. ఈ నేపథ్యంలో సమంత నాగచైతన్య వివాహం చేసుకోవడం, అనంతరం నాలుగేళ్లకే విడిపోతున్నారు ప్రకటించారు. ఆ తరువాత వారి అభిమానులతో పాటు, సినీ ఇండస్ట్రీ వారు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆరోజు కొందరు సమంతకు అండగా నిలవగా, మరికొందరు పలు రకాల రూమర్లు సృష్టించి సోషల్ మీడియాలో వ్యక్తి గతంగా దెబ్బతీశారు. ఆ సందర్భంలో హీరో సిద్ధార్థ్ చేసిన ‘మోసగాళ్లు ఎప్పటికీ అభివృద్ధి చెందరు’ అని ట్వీట్ చేయగా అది అత్యంత వివాదాస్పదమైంది. ఎవరు ఎన్ని రూమర్లు సృష్టించిన, అవి తనని ఏమి చేయవని, వాటిని పట్టించుకోనని, సమంత నిన్న ఇంస్టాగ్రాంలో తెలిపింది. దీనిపై తాజాగా సిద్దార్థ్ స్పందించాడు.

అయితే, నిన్న మహా సముద్రం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఒక న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, ఆ ట్వీట్ గురించి యాంకర్ అడగగా సిద్ధార్థ్ తన ట్వీట్‌తో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదని, అది తన చిన్నప్పుడు తన టీచర్ తనకు నేర్పించిన దాని ఆధారంగా పెట్టడం జరిగిందని వెల్లడించాడు. తన రాబోయే తెలుగు చిత్రం మహా సముద్రం కూడా ఇదే అంశంతో కూడుకుందని వెల్లడించాడు.
తాను చేసిన ట్వీట్ తో ఏ ఒక్క వ్యక్తితో సంబంధం లేదని, అనవసరంగా వేరొకరి పేరు లాగవద్దని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు, నాకు సంబంధం లేదని, వాటిని నేను బాధ్యత వహించనని తెలిపాడు. తన ఇంటి బయట కుక్కలు ఉన్నాయని అని తెలిస్తే నేను వారిని కుక్కలు అని పిలుస్తానని, తప్పు అనిపిస్తే ఎవరు తనపై ఫిర్యాదు చేయకూడదని సిద్ధార్థ్ స్పష్టం చేశారు.