Homeజాతీయ వార్తలుఆ వ్యూహంలో భాగమేనా.. శశికళ రాజీనామా..!

ఆ వ్యూహంలో భాగమేనా.. శశికళ రాజీనామా..!

Sasikala
ఎన్నో ఆశలతో.. రాజకీయాల్లో చక్రం తిప్పాలనే లక్ష్యంతో జైలు నుంచి బయటకొచ్చారు శశికళ. అన్నాడీఎంకేను ఎలాగైనా సొంతం చేసుకోవాలని టార్గెట్‌ ఆమెది. అందుకే.. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత నేతలందరినీ వరుసగా కలిశారు. పెద్దగా హడావిడి చేయకుండా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడంపై శశికళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒకవైపు న్యాయపరంగా పోరాడుతూనే మరోవైపు అన్నాడీఎంకేలో అధికశాతం మంది నేతలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని భావించారు.

Also Read: ఆంధ్రా బంద్: ‘విశాఖ ఉక్కు’ కోసం.. కదిలిన దండు..

అయితే.. శశికళ తాజాగా చేసిన ప్రకటన కూడా వ్యూహంలో భాగమేనంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగా ఉంటేనే బెటరని భావించి ఆ ప్రకటన చేశారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి తర్వాత శశికళ తిరిగి యాక్టివ్ అవుతారంటున్నారు. ఇందుకు ముందుగా పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య విభేదాలు తలెత్తితేనే తమ పని సులువవుతుందని శశికళ గ్రహించారు. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ఇద్దరు బలమైన నేతలు కలిసి ఉంటే అన్నాడీఎంకేను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదని శశికళకు తెలియనిది కాదు.

అందుకే.. ఇద్దరిలో ఒకరిని తమ వైపునకు తిప్పుకుంటే తాము అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటామని అంచనా వేస్తున్నారు. శశికళ పళనిస్వామి కంటే పన్నీర్ సెల్వంను తన వద్దకు రప్పించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. పళనిస్వామి తనను నమ్మించి మోసం చేశారని శశికళ భావిస్తున్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేయడాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. ఆర్థిక భారాన్ని సైతం తాను భరించి రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను ఉంచి పళనిస్వామిని సీఎంను చేస్తే తాను జైలుకు వెళ్లగానే తనను పదవి నుంచి తొలగించారని శశికళ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Also Read: జగన్ మోసం చేశాడు.. తెలంగాణలో రోడ్డున పడ్డ షర్మిల.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

అందుకే.. ఇటీవల అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం చీఫ్ దినకరన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారంటున్నారు. పన్నీర్ సెల్వం శశికళకు మద్దతు ప్రకటిస్తే తాము ఆయనను సాదరంగా ఆహ్వానిస్తామని దినకరన్ చెప్పారు. జయలలిత జీవించి ఉన్న సమయంలో కూడా అమ్మకు నమ్మిన బంటుగా పనిచేశారని, ఇప్పుడు రావణాసురుడి కొలువులో పన్నీర్ సెల్వం ఉన్నారని వ్యాఖ్యానించారు. పళనిస్వామి కంటే పన్నీర్ సెల్వం బెటర్ అని శశికళ భావిస్తున్నట్లు తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే.. శశికళ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం వ్యూహంలో భాగమేనంటున్నారు రాజకీయ నిపుణులు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular