Bandi Sanjay Vs KCR: ఏ కొంచెం ఛాన్స్ దొరికినా కేసీఆర్ మీద విరుచుకు పడే బండి సంజయ్.. మరోసారి తన మార్కు చూపించేందుకు రెడీ అవుతున్నారు. అప్పట్లో మాటి మాటికీ కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామంటూ చెప్పేవారు. ఏ ధైర్యంతో అలా చెప్పేవారో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కేసీఆర్ మీద లీగల్ చర్యలకు రెడీ అయిపోతున్నారు. మొన్న ప్రెస్ మీట్టి కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటూ చేసిన కామెంట్లు ఎంతలా వివాదాస్పదం అవుతున్నాయో అందరికీ తెలిసిందే.
అయితే ఈ కామెంట్లను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే.. బండి సంజయ్ దీక్ష కూడా చేశారు. అంతే కాదు పార్టీ నేతలతో కూడా దీక్ష చేయించి పెద్ద రాద్దాంతమే చేశారు. అయితే ఇంతటితో వదిలేయకుండా ఎలాగైనా దీన్ని పెద్దది చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ లీగల్ సెల్ టీమ్ ను తన ఆఫీసుకు పిలిపించుకుని చర్చిస్తున్నారు.
Also Read: ఏది చేద్దామన్నా బెడిసికొడుతోందే.. టీడీపీ పరిస్థితి ఇలా అయిందేంటి..?
కేసీఆర్ మీద లీగల్ గా వెళ్లాలని పెద్ద ప్లానే వేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దేశంలో అత్యున్నత రాజ్యాంగం మీద చేసిన కామెంట్లను బేరీజు వేసుకుని ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చనే దాని మీద కూలంకుషంగా చర్చిస్తున్నారు. ఇక లీగల్ సెల్ టీమ్ సలహా మేరకు మరొకొద్ది రోజుల్లోనే కోర్టులో పిటిషన్ వేసే అవకాశం లేకపోలేదు. అయితే బండి కంటే ముందుగానే కాంగ్రెస్ ఏకంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టేసింది.
ఈ విషయంలో కొంత ఆలస్యం జరిగిందనే చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ నేతలు అయితే ఏకంగా రాజద్రోహం కేసు పెట్టాలంటూ తెగ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. కాంగ్రెస్ వాళ్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కానీ వాటి మీద పోలీసులు కేసులు నమోదు చేస్తారా అంటూ అనుమానమే. ఇక బండి సంజయ్ కోర్టుకు ఎక్కితే మాత్రం కచ్చితంగా విచారణకు ఆదేశించే ఆస్కారం ఉంటుంది.
కానీ ఇక్కడే బీజేపీకి ఓ విషయం అడ్డు పడుతోంది. ఎందుకంటే కేసీఆర్ కంటే దారుణమైన కామెంట్లు గతంలో బీజేపీ నేతలు చేశారు. భగవద్గీత కంటే రాజ్యాంగం గొప్పది కాదన్న వారు కూడా ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్దే అయితే ఏకంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్నారు. ఇందులో ఉన్న లౌకిక పదం పనికి రాదంటూ చెప్పారు. మరి బీజేపీ నేతలు చేసిన కామెంట్లను పక్కన పెట్టి కేసీఆర్ మీద కోర్టుకు ఎక్కితే.. టీఆర్ ఎస్ వాళ్లు ఆ విషయాలను ప్రస్తావించక మానరు. పైగా అలా కోర్టులో పిటిషన్లు వేయాల్సి వస్తే ముందుగా బీజేపీ వాళ్ల మీద వేయాలని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది. అయినా సరే తానేంటో నిరూపించుకునేందుకు బండి పెద్ద ప్లానే వేస్తున్నారు.
Also Read: గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.. ఆ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయట!