Vishnu Manchu: జగన్ సినిమా ఇండస్ట్రీని దెబ్బ తీస్తున్నా.. థియేటర్ల పై ఉక్కుపాదం మోపుతున్నా.. నిర్మాతలు ఎంత ఇబ్బంది పడినా.. మంచు విష్ణు మాత్రం ఇన్నాళ్లు ఎక్కడా కనిపించలేదు. అయితే, రేపు ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి, సినీ ప్రముఖులు భేటీ అవనుంది. అలాగే ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి సీఎం జగన్‌తో ఇప్పటికే భేటీ అయ్యాడు. భేటీ పై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంతకీ మంచు విష్ణు ఏమి మాట్లాడాడు అంటే.. ‘చిరంజీవి, జగన్ ను కలవడం విషయంలో పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్ తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని చెప్పారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని, సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
Also Read: ఏది చేద్దామన్నా బెడిసికొడుతోందే.. టీడీపీ పరిస్థితి ఇలా అయిందేంటి..?
మొత్తానికి చిరంజీవి, జగన్‌ది పర్సనల్ మీటింగ్ అంటూ విష్ణు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. థియేటర్ల పై ఉక్కుపాదం మోపుతున్నా.. సినిమా ఇండస్ట్రీ నిలబడటం కష్టం అనే స్థాయికి వెళ్ళిపోయినా.. మంచు విష్ణు ఇన్నాళ్లు మాట్లాడడానికి కూడా ముందుకు రాలేదు. అసలు థియేటర్స్ పై ఏపీలో జగన్ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుంటే మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇన్ని రోజులు ఏమి చేశాడు ?
నిర్మాతల దగ్గర నుంచి చిన్న చిన్న బయ్యర్ల వరకూ అందరూ కన్నీళ్లతో తమ కష్టాలు ఇబ్బందులు చెప్పుకుని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంటే.. మంచు ఫ్యామిలీ మాత్రం సైలెంట్ గానే ఉంది. అసలు ఏ సినిమా వాడికి కష్టం వచ్చినా మేము ఉన్నాము అంటూ ‘మా’ అధ్యక్షుడు ముందుకు రావాలి. అది ఆ పదవి ప్రాథమిక బాధ్యత. కానీ మంచు విష్ణు ఎక్కడా తన బాధ్యతను నిర్వహించలేదు.

పైగా ఆయన ప్రెసిడెంట్ కుర్చీ ఎక్కి నెలలు గడిచిపోతున్నాయి. చివరకు సినిమా ఇండస్ట్రీనే కష్టాల్లో మునిగిపోయే పరిస్థితి వచ్చినా మంచు విష్ణు మాత్రం అటు వైపు తొంగి చూడలేదు తాజాగా మెగాస్టార్ పై కామెంట్స్ చేయడం ఆశ్చర్యకరం.