Sahakar Taxi Cabs: పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి క్యాబ్స్, ఆటో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే సొంతంగా వాహనాలు లేని వారు క్యాబ్స్ బుక్ చేసుకుంటారు. డబ్బు తక్కువ ఉన్నవారు లేదా సింగిల్ గా ఉన్నవారు బైక్ ను బుక్ చేసుకుంటారు. అయితే వీటి సర్వీసులు ఇవ్వడానికి OLA, UBER, Rapido కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీల యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మనకు కావాల్సిన ప్రాంతం ఎంచుకుంటే.. వాహనాలు ఉన్నచోటకే వస్తాయి. ఆ తర్వాత కావాల్సిన ప్రదేశానికి వెళ్లవచ్చు. అయితే క్యాబ్స్ కు కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. నగరాల్లో అయితే మరి ఎక్కువగా ఉంటుంది. దీంతో కొందరి ఉద్యోగులకు ఇది పెనుభారంగా మారింది. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అదేంటో తెలుసా?
క్యాబ్స్, ఆటో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని ప్రయాణించడం వల్ల కాస్త సౌకర్యంగానే ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో వీటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు ప్రతిరోజు వీటి ద్వారా ప్రయాణం చేయడం వల్ల తమ జీవితంలో ఎక్కువ శాతం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్ని కంపెనీల ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో అతి తక్కువ ధరకే ప్రయాణించడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వనుంది. త్వరలో ప్రయాణికుల కోసం Sahakar అనే యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.. ఈ యాప్ ద్వారా క్యాబ్స్, ఆటో, బైక్ లను బుక్ చేసుకోవచ్చు. అయితే పై కంపెనీల కంటే దీని ద్వారా బుక్ చేసుకుంటే చాలా తక్కువకు ప్రయాణించవచ్చు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ యాప్ కనుక. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా ప్రయాణం చేయడం వల్ల డ్రైవర్ కు ఎక్కువగా ఆదాయం వస్తుంది. మధ్యవర్తిగా ఎటువంటి కంపెనీ లేకపోవడంతో ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇటు ప్రయాణికులకు.. ఆటో డ్రైవర్లకు సౌకర్యంగా ఉండే ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.
అయితే ఈ యాప్ డిసెంబర్లో రాబోతుంది. అది కూడా ముందుగా ఎంచుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తారు. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ముందుగా దీనిని అమలు చేసి.. సక్సెస్ అయిన తర్వాత భారతదేశం అంతటా వచ్చే అవకాశం ఉంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. ఒకవేళ ఈ యాప్ అందుబాటులోకి వస్తే చాలామందికి ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజు వేలమంది ఆన్లైన్ లో బుక్ చేసి ప్రయాణిస్తున్నారు. వీరికి సహకార యాప్ అందుబాటులోకి వస్తే తక్కువ దొరికే ప్రయాణం చేసే అవకాశం వస్తుంది.