పాస్‌బుక్స్‌ ఉన్నోళ్లందరికీ రైతుబంధు

రైతుబంధు స్కీం ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌. అయితే.. ఇక నుంచి రాష్ట్రంలో పాస్‌బుక్స్‌ ప్రతి రైతుకూ ఈ సాయం అందించనున్నారు. ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయంతో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కొత్తగా 28,673 మందికి లబ్ధి చేకూరనుంది. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో 2.56 లక్షల మంది రైతులకు రూ.313.37 కోట్లు, నల్లగొండలో 4.39 లక్షల మంది రైతులకు 583.86 కోట్లు ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 27 […]

Written By: Srinivas, Updated On : December 23, 2020 10:40 am
Follow us on


రైతుబంధు స్కీం ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌. అయితే.. ఇక నుంచి రాష్ట్రంలో పాస్‌బుక్స్‌ ప్రతి రైతుకూ ఈ సాయం అందించనున్నారు. ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయంతో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కొత్తగా 28,673 మందికి లబ్ధి చేకూరనుంది. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో 2.56 లక్షల మంది రైతులకు రూ.313.37 కోట్లు, నల్లగొండలో 4.39 లక్షల మంది రైతులకు 583.86 కోట్లు ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 27 నుంచి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 6.95 లక్షల మంది రైతులకు 897.26 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది.

Also Read: కేసీఆర్ “లేట్” ప్లాన్: బీజేపీ కార్పోరేటర్లే టార్గెట్

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10 వేల సాయం అందిస్తున్నారు. రైతు బంధు స్కీం ద్వారా ఈ సాయం అందిస్తున్నారు. ఈ మేరకు వచ్చే యాసంగికి ఇప్పడిప్పుడే నారుమళ్లు సిద్ధం చేసుకునే పనిలో రైతులు బిజీగా ఉండగా.. ఈనెల 27 నుంచి పెట్టుబడి సాయం అందించేందుకు సీఎం కేసీఆర్‌‌ నిర్ణయించారు. ఈ మేరకు నిధులు కూడా విడుదలయ్యాయి.

Also Read: సాగర్లో బీజేపీ వ్యూహం అదేనా?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత వానాకాలంలో సూర్యపేట జిల్లాలోని 2.39.398 మందికి, నల్లగొండలో 4,27,582 మంది రైతులకు సాయం అందించారు. ఈ సారి అదనంగా మరో 23,673 మంది పాస్‌బుక్స్‌ అందుకోవడంతో ఆ రైతులకు కూడా రైతుబంధు దక్కనుంది. సూర్యపేటలో 16,987 మందికి కొత్తగా పాస్‌ బుక్స్‌ రాగా.. నల్లగొండలో 11,686 మందికి ఇచ్చారు. ఈ మేరకు కసరత్తు పూర్తికావచ్చిందని సూర్యపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జ్యోతిర్మయి తెలిపారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్