భయం గుప్పిట్లో టాలీవుడ్.. ఏం జరుగనుంది?

కరోనా తగ్గిపోయిందనుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25కు కొన్ని.. సంక్రాంతికి మరికొన్ని సినిమాలు ప్లాన్ చేశారు. ప్రభుత్వాలు థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో ఈ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు పెద్దసినిమాలు రెడీ అయ్యాయి. కరోనా భయం తొలగిపోవడంతో ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని నిర్మాతలు భావించారు. Also Read: 2020లో వివాహ బంధంతో ఏకమైన సినీ ప్రముఖులు ! సంక్రాంతి టార్గెట్ గా పెద్ద హీరోలు కొంత మంది రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసి రెడీగా ఉన్నారు. […]

Written By: NARESH, Updated On : December 23, 2020 8:31 pm
Follow us on

కరోనా తగ్గిపోయిందనుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25కు కొన్ని.. సంక్రాంతికి మరికొన్ని సినిమాలు ప్లాన్ చేశారు. ప్రభుత్వాలు థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో ఈ సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు పెద్దసినిమాలు రెడీ అయ్యాయి. కరోనా భయం తొలగిపోవడంతో ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని నిర్మాతలు భావించారు.

Also Read: 2020లో వివాహ బంధంతో ఏకమైన సినీ ప్రముఖులు !

సంక్రాంతి టార్గెట్ గా పెద్ద హీరోలు కొంత మంది రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసి రెడీగా ఉన్నారు. కానీ ఇంతలో మరో ఉపద్రవం. బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. బ్రిటన్ నుంచి మనదేశానికి వచ్చిన 25మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొందరికి పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. మళ్లీ లాక్ డౌన్ విధించాలన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. పలు దేశాలు విధించాయి కూడా..  ఈ నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే మళ్లీ జనాలు వస్తారా? ఈ ఉపద్రవంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తారా? అన్నది సినిమా ఇండస్ట్రీని భయపెడుతోంది.

ఇప్పటికే బ్రిటన్ లో లాక్ డౌన్ విధించారు. దేశంలోని మహారాష్ట్రలో రాత్రి పూట లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. దీంతో ఇఫ్పుడు థియేటర్లు తెరిచి వెంటనే లాక్ డౌన్ అంటే మళ్లీ సినిమా పరిశ్రమ కోలుకునే అవకాశాలు లేవు. ఆర్థికంగా మరింత భారం అవుతుంది.

Also Read: ఓ ఇంటివాడు కాబోతున్న అవినాష్… అమ్మాయి ఎవరంటే?

సంక్రాంతికి కరోనా దేశంలో ప్రబలకుండా కట్టడిలో ఉంటేనే సినిమా ఇండస్ట్రీ మళ్లీ నిలబడుతుంది. లేదంటే మరో ఆరు నెలల వరకు ఇండస్ట్రీ లేవడం కష్టమే. ఇదే జరిగితే థియేటర్లు, సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్