కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళన త్వరలో ముగుస్తుందని భావిస్తున్నానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అశాభావం వ్యక్తం చేశారు. బుధవారం రైతు దినోత్సవం సందర్భంగా ఆయన ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు. ‘రైతు దినోత్సవం సందర్భంగా దేశానికి సహకరించిన రైతులకు శుభాకాంక్షలు. వారు దేశానికి ఆహార భద్రత కల్పించారు. కొంత మంది రైతులు వ్యవసాయ చట్టాల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వారితో పెద్ద మనసుతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. దీంతో రైతులు త్వరలో తమ నిరసనను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నాను’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా రైతుల ఆందోళన నేటితో 28వ రోజుకు చేరుకుంది.