Homeబిజినెస్Motorola Edge 70 Fusion: మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్.. ఏం ఫీచర్లు సామీ.. ఇంత...

Motorola Edge 70 Fusion: మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్.. ఏం ఫీచర్లు సామీ.. ఇంత తక్కువ ధరలో ఇలాంటి ఫోన్ లభించదు

Motorola Edge 70 Fusion: కొత్తగా మొబైల్ కొనాలని ఎదురుచూసే వారికి Motorola కంపెనీ శుభవార్త తీసుకొచ్చింది. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న ఈ కంపెనీకి చెందిన Edge 70 fusion మొత్తానికి మార్కెట్లోకి వచ్చింది. 2026 మార్చి 6 వ తేదీ నుంచి దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్లో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన 7s Gen 4 చిప్ సెట్ తోపాటు మెరుగైన కెమెరా పనితీరు. బ్యాటరీ సామర్థ్యం వంటివి అప్డేట్ అయి ఉన్నాయి. కొత్తగా మొబైల్ కొనే వారితోపాటు యూత్ కు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ మొబైల్ లో ఆకర్షణీయమైన ఫీచర్లు మాత్రమే కాకుండా అతి తక్కువ ధరలో దీనిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇంతకీ ఈ మొబైల్ ధర ఎంత అంటే?

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

Motorola Edge 70 Fusion మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అనుకోవచ్చు. ఇప్పటివరకు ఈ కంపెనీకి చెందిన ఏ మొబైల్ లో లేని డిస్ప్లే ఇందులో కనిపిస్తుంది. ఈ మొబైల్లో 6 పాయింట్స్ 78 అంగుళాల HD AMOLED డిస్ప్లే ని చూడవచ్చు. ఇది 1.5 k Resolution తో పనిచేస్తుంది. అలాగే 5200 nits బ్రైట్నెస్ కలిగి ఉండి అత్యధిక కాంతివంతంగా డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే పై కార్నింగు గొరిల్లా క్లాస్ 7i ప్రొటెక్షన్ ను ఇస్తుంది. అలాగే ఈ మొబైల్లో 7s Gen 4 చిప్ సెట్ ఉండనుంది. దీంతోపాటు 12gb రామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంచారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత UI తో పనిచేస్తుంది. ఐదు సంవత్సరాలపాటు OS అప్డేట్ అవుతూ లేటెస్ట్ టెక్నాలజీని పొందవచ్చు.

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇలాంటి వారికి ఈ ఫోన్ అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 13 MP అల్ట్రా వైడ్ సెన్సార్ పనిచేస్తుంది.32 MP ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ కెమెరాలతో ఫోటోలు మాత్రమే కాకుండా ఫోర్ కే వీడియో రికార్డింగ్ చేసుకునేందుకు చాన్స్ ఉంది.

మోటరోలా ఎడ్జ్ 70 Fusion బలమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులో 7000 mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 68 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో నేటితరం యూత్ కు అనుగుణంగా ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్లూటూత్ 6.0, వైఫై 6e, ఎన్ ఎఫ్ సి, జిపిఎస్ వంటివి ఫాస్ట్ కనెక్టింగ్ తో సపోర్టు ఇస్తుంది. ఈ మొబైల్ 8 జిబి రామ్ 256 జీబీ స్టోరేజ్ తో కొనుగోలు చేయాల్సి వస్తే ధర రూ.26,999 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కాన్ఫిగరేషన్ పెరిగితే ధర మారే అవకాశం ఉంటుంది. మిడ్ రేంజ్ పీపుల్స్ కొత్తగా మొబైల్స్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version