Russia Ukraine War: రష్యా యుద్ధం ప్రారంభించింది. ఉక్రెయిన్ పై తన సేనలతో విరుచుకుపడుతోంది. అంతర్జాతీయ సమాజాన్ని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతోంది. పసికూన ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది. దీన్ని అన్ని దేశాలు ఖండిస్తున్నా లెక్క చేయడం లేదు. 1991 వరకు సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ రష్యా విచ్చిన్నం తరువాత స్వతంత్ర దేశంగా అవతరించింది. దీంతో అప్పటి నుంచి ఉక్రెయిన్ కు రష్యాకు పడటం లేదు. దీంతో రెండు దేశా మధ్య వైరుధ్యం పెరిగిపోయింది. అది యుద్ధం వరకు దారి తీసింది.
రష్యా చర్యలను అమెరికా ఖండిస్తోంది. ఉక్రెయిన్ పై దాడిని సహేతుకమైనది కాదని అభివర్ణిస్తోంది. ఒక దేశం భౌగోలిక ప్రాంతాన్ని కబలించడం సరైనది కాదని చెబుతోంది. కానీ రష్యా మాత్రం ఎవరి మాటలు వినదలుచుకోలేదని స్పష్టం చేస్తోంది. తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే చూస్తోంది. ఉక్రెయిన్ తొక్కేయాలని పావులు కదుపుతోంది. దీంతో ఉక్రెయిన్ కూడా తగ్గేదే లే అంటూ రష్యాతో యుద్ధానికే సై అంటోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా రష్యా ఒంటరిదైనా తన పంతం మాత్రం వీడటం లేదు.
Also Read: రివ్యూ : ‘భీమ్లా నాయక్’ హిట్టా ? ఫట్టా ?
ఉక్రెయిన్ పై దాడిని నాటో దేశాలు ఖండిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ లో భారత్ కు చెందిన వారు దాదాపు 20 వేల మంది చిక్కుకుపోయారు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ తో విమాన యాన సర్వీసులను రద్దు చేసుకోవడంతో అందరు బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు. వారి రాక కోసం ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. వారిని స్వదేశానికి రప్పించేందుకు మార్గాలు అన్వేషిస్తోంది.
భారత్ అలీన విధానాన్ని అవలంభిస్తుందని తెలిసినా రష్యా మిత్ర దేశం కావడంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది. యుద్ధం వద్దని సూచిస్తున్నా పెద్ద దేశాల అభిప్రాయాలనే పెడచెవిన పెడుతోంది. దీంతో రష్యా విధానాన్ని అటు ఖండించలేక ఇటు సమ్మతించలేక సతమతమవుతోంది. బ్రిటన్, జర్మనీ లాంటి దేశాలు కూడా యుద్ధం వద్దని వారిస్తున్నా రష్యా మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది.
రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను అందరు ఖండిస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. అంతర్జాయంగా వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ ను ఉక్కుపాదంతో అణచివేసి తన ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు కాలు దువ్వడం తెలిసిందే. భవిష్యత్ లో ఇంకా ఏ పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ వైపు యుద్ధానికి సిద్ధమైన రష్యాతో ఇమ్రాన్ భేటీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమెరికా దీన్ని ఖండిస్తోంది. పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా వ్యవహరించడం సమంజసం కాదని హితవు చెబుతోంది. మొత్తానికి రష్యా మాత్రం ఎందరు చెప్పినా తన అభిప్రాయం మార్చుకోవడం లేదని తెలుస్తోంది.
Also Read: భీమ్లా నాయక్ పై మహేష్, చిరంజీవి రియాక్షన్ !