Bheemla Nayak Tickets Controversy: టాలీవుడ్‌లో ఏ హీరోకు లేనంత హార్డ్ కోర్ అభిమానులు కేవలం పవన్‌కు మాత్రమే ఉన్నారు. చాలామంది అతన్ని దేవుడు అంటూ కొలుస్తారంటే ఎంత పిచ్చి అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు భీమ్లానాయక్ సినిమా చూసేందుకు చాలామంది ఎగబడుతున్నారు. ముఖ్యంగా టికెట్లకోసం పెద్ద గొడవే జరుగుతోంది. దాంతో ఏపీలని చాలాచోట్ల రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు.

తామే పవన్ కల్యాన్ అసలైన అభిమానులమని, తమదే మొదటి నుంచి ఉన్న అసోసియేషన్ అని అవతలి వారిది డూప్లికేట్ అంటూ గొడవలు జరుగుతున్నాయి. తమకు ఇవ్వకుండా డూప్లికేట్ అసోసియేషన్ వాళ్లకు టికెట్లు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఇక నెల్లూరులోని కావలిలో ఓ వర్గం వారు ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. తాము ఎప్పటి నుంచో పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నడుపుతున్నామని అంటున్నారు.
Also Read: కేటీఆర్ కు పవన్ రాసిన లేఖలో ఏముంది?
అయితే వైసీపీ నుంచి వచ్చిన కొందరు తామే అసలైన పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకుని టికెట్లు మొత్తం తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ లో వైసీపీ రచ్చ జరుగుతోంది. ఇక అటు నెల్లూరులోని టౌన్ లో అయితే రానా ఫ్యాన్స్ పెద్ద గొడవ చేస్తున్నారు. టికెట్లు అన్నీ పవన్ ఫ్యాన్స్‌కే ఇస్తున్నారని, రానా ఫ్యాన్స్‌కు ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి రానా సినిమాల టికెట్లు బల్క్ గా కొంటూ వస్తున్నామని, కానీ ఇప్పుడు మాత్రం తమకు ఇవ్వకపోవడంపై దగ్గుబాటు అభిమానులు ఆందోళన తెలుపుతున్నారు.

ఇలా పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ల నడుమ, అలాగే పవన్ ఫ్యాన్స్ వర్సెస్ రానా ఫ్యాన్స్ అన్నట్టు గొడవలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని చోట్ల అయితే టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయని పవన్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోవద్దని ఏకంగా థియేటర్ల దగ్గర హుండీ పెడుతున్నారు. దాంట్లో డబ్బులు వేయాలంటూ కోరుతున్నారు. మరీ ఇంత పిచ్చి అభిమానం ఏంటంటూ చాలామంది నోరెళ్ల బెడుతున్నారండోయ్.
Also Read: రివ్యూ : ‘భీమ్లా నాయక్’ హిట్టా ? ఫట్టా ?
[…] […]
[…] Bheemla Nayak Movie AP Govt: పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు కాబట్టే.. భీమ్లానాయక్ సినిమాపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అదే ఈ సినిమాలో మరో హీరో నటించి ఉండి ఉంటే.. అంతా సజావుగా ఉండేది. అందుకే.. ఈ సినిమా విషయంలో అనేక పొరపాట్లు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికి పవన్ పై జగన్ ప్రభుత్వం కక్ష్య సాధిస్తోందంటూ విజయనగరం జిల్లా కొత్తవలసలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. […]
[…] Bheemla Nayak Ticket Price in AP: ఏపీలో ఇప్పుడు మాస్ జాతర షురూ అయింది. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన భీమ్లానాయక్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. అన్ని సెంటర్లలో టికెట్లు ఆల్రెడీ అమ్ముడు పోయాయి. ఎక్కడ చూసినా భీమ్లానాయక్ ఫీవరే కనిపిస్తోంది. అయితే ఏపీలో ఈ మూవీకి పాత రేట్లకే టికెట్లు అమ్మాలనే రూల్ ఇంకా సాగుతోంది. ఎలాగూ ఇంకో వారం తర్వాత కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయనే నమ్మకంతోనే మూవీని రిలీజ్ చేశారు. […]