Homeఅంతర్జాతీయంWagner Group Russia: వార్ సీన్ లోకి పుతిన్.. దెబ్బకు గుండు బాస్ సెట్ రైట్...

Wagner Group Russia: వార్ సీన్ లోకి పుతిన్.. దెబ్బకు గుండు బాస్ సెట్ రైట్ అయ్యాడు

Wagner Group Russia: ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న వేళ శనివారం జరిగిన పరిణామాలు రష్యా దేశాన్ని కలవరపెట్టాయి.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను ఇబ్బందులకు గురి చేశాయి.. అమెరికా నుంచి మొదలు పెడితే ఆస్ట్రియా వరకు అన్ని దేశాలు రష్యా మీద వేలెత్తి చూపించాయి.. ఉగ్రవాద దేశమంటూ ఆరోపణలు చేశాయి.. దీంతో వాగ్నర్ గ్రూప్ కలగజేసిన శిరోభారం నుంచి ఉపశమనం పొందేందుకు పుతిన్ మాస్టర్ ప్లాన్ రూపొందించాడు. దెబ్బకు ఒకసారిగా గుండు బాస్ ( ప్రిగో జిన్) సెట్ రైట్ అయ్యాడు.

పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ ఊహించని విధంగా తిరుగుబాటు చేయడంతో రష్యాలో అంతర్యుద్ధం పరిస్థితులు ఏర్పడ్డాయి. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేసిన వ్యాగన్ఆర్ గ్రూప్ చీఫ్ ప్రిగో జిన్ రష్యాలోని పలు కీలక నగరాలను కొన్ని గంటల వ్యవధిలోనే ఆక్రమించాడు. దీంతో పుతిన్ తన మాస్టర్ బ్రెయిన్ కు పని చెప్పాడు.. బెలారస్ అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించేలా చేశాడు. దీంతో గుండు బాస్ వెనక్కి వెళ్లేలా తప్పలేదు.

బెలారస్ అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించడంతో వాగ్నర్ గ్రూప్ గంటల వ్యవధిలోనే వెనక్కి వెళ్ళింది. అంతేకాదు తన బలగాలను రోస్తోవ్ నుంచి బెలారస్ తరలిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు వాగ్నల్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ పై క్రెమ్లిన్ క్రిమినల్ కేసులు ఎత్తివేసింది. రక్తపాతం, అంతర్ యుద్ధాన్ని నివారించడమే తమ లక్ష్యమని క్రెమ్లిన్ ప్రతినిధి విలేకరులతో చెప్పడం విశేషం.

ఇక బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకా షెంకో మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందం ప్రకారం వాగ్నర్ ఫైటర్స్ పై ఎటువంటి విచారణ ఉండదు. వారు ఉక్రెయిన్ దేశం పై చూపించిన వీరోచిత పోరాటాన్ని తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ విలేకరులకు వివరించారు.. వాగ్నర్ సేన తిరిగి తమ స్థావరాలకు వస్తుందని.. వారు రష్యా సైన్యంతో కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. ఇక వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగో జిన్ తన సైన్యాలను మాస్కో వెళ్లకుండా నిలిపివేయడంతో రష్యాలో దాదాపు అంతర్యుద్ధం ముప్పు తప్పింది. కాగా శనివారం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగో జిన్ , రష్యా మిలిటరీ ఉన్నతాధికారుల మధ్య వైరం తీవ్రం కావడంతో.. దక్షిణ రష్యాలోని కీలకమైన ఆర్మీ ప్రధాన కార్యాలయాలను కిరాయి సైనికులు స్వాధీనం చేసుకున్నారు. మరో అడుగు ముందుకు వేసి రాజధాని మాస్కో నగరాన్ని ముట్టడించేందుకు వెళ్లారు.. దీంతో రష్యాలో దాదాపు అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. బెలారస్ అధ్యక్షుడు మధ్యవర్తిత్వం నెరపడంతో వాగ్నర్ గ్రూప్ వెనకడుగు వేసింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version