https://oktelugu.com/

Adipurush Movie: ఓం రౌత్ ఫెయిల్… రామాయణంకి న్యాయం చేసే మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎవరు?

ఆదిపురుష్ చిత్రానికి కనీసం పాస్ మార్క్స్ కూడా ఓం రౌత్ తెచ్చుకోలేకపోయారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ వంటి భారీ క్యాస్ట్, వందల కోట్ల బడ్జెట్ ఇచ్చినా కనీసం మెప్పించే చిత్రం తెరకెక్కించలేకపోయారు. ఓం రౌత్ గత చిత్రం తన్హాజి.

Written By:
  • Shiva
  • , Updated On : June 26, 2023 / 10:45 AM IST

    Adipurush Movie

    Follow us on

    Adipurush Movie: ఆదిపురుష్ చిత్ర దర్శకుడు ఓం రౌత్ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన రామాయణ గాథను తెరకెక్కించిన తీరు మెజారిటీ ఆడియన్స్ కి నచ్చలేదు. ఈ జనరేషన్ ఆడియన్స్ కోసం అంటూ మూలాలనే మార్చేశారు. చరిత్ర, ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు కాలాలు మారినంత మాత్రాన మారవు. వాటిని ప్రజల నమ్మకాల ఆధారంగానే చూపించాలనే లాజిక్ మిస్ అయ్యాడు. అసలు రామాయణంలో లేని కొన్ని సన్నివేశాలు ఆదిపురుష్ కోసం ఓం రౌత్ రాసుకున్నాడు.

    ఆదిపురుష్ చిత్రానికి కనీసం పాస్ మార్క్స్ కూడా ఓం రౌత్ తెచ్చుకోలేకపోయారు. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ వంటి భారీ క్యాస్ట్, వందల కోట్ల బడ్జెట్ ఇచ్చినా కనీసం మెప్పించే చిత్రం తెరకెక్కించలేకపోయారు. ఓం రౌత్ గత చిత్రం తన్హాజి. ఇది పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు. తన్హాజి ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో తన్హాజి ఆరోపణలు ఎదుర్కొంది. అదే పొరపాటు ఆదిపురుష్ చిత్రానికి కూడా కంటిన్యూ చేశాడు.

    కాబట్టి కొన్ని ఎపిక్ చిత్రాలను తెరకెక్కించాలంటే భారీ క్యాస్ట్, బడ్జెట్ కి మించి మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలి. ప్రతిభ గల దర్శకుడు చాలా అవసరం. ఆదిపురుష్ మూవీ వైఫల్యం అనంతరం రామాయణం తెరకెక్కించడానికి బెస్ట్ ఛాయిస్ ఎవరనే చర్చ మొదలైంది. ఈ లిస్ట్ లో మొదట వినిపించే పేరు రాజమౌళి. ఈ అపజయమెరుగని దర్శకుడు రామాయణం తెరకెక్కిస్తే వరల్డ్ మెచ్చే చిత్రం అవుతుందని పలువురు భావిస్తున్నారు.

    అలాగే సంజయ్ లీలా భన్సాలీ రామాయణ గాథకు న్యాయం చేయగల సత్తా ఉన్న దర్శకుడు. ఆయన తెరకెక్కించిన దేవదాసు, పద్మావత్, బాజీరావ్ మస్తానీ ఎపిక్స్ గా ఉన్నాయి. అలాగే మాస్టర్ స్టోరీ టెల్లర్ మణిరత్నం రామాయణం తెరకెక్కించ సత్తా గల దర్శకుడు. ఈ లిస్ట్ లో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కూడా ఉన్నారు. ఆయనకు విఎఫ్ఎక్స్ పై గట్టి పట్టుంది. ఇండియాలోనే విఎఫ్ఎక్స్ విషయంలో ఆయన దిట్ట. అలాగే కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై కూడా ప్రేక్షకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.