Homeఆంధ్రప్రదేశ్‌Roads Will Be Repaired After One Year: ఏడాది తరువాతే రహదారులు బాగుపడతాయట.. గడువు...

Roads Will Be Repaired After One Year: ఏడాది తరువాతే రహదారులు బాగుపడతాయట.. గడువు పెంచుకుపోతున్న సీఎం జగన్

Roads Will Be Repaired After One Year: పథకాల పేరుతో ప్రజలకు పప్పూ బెల్లం పంచుతున్నాం. ఇక అభివ్రుద్ధితో ఏం పని అనుకుంటుందో ఏమో.. ఏపీ సర్కారు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై పిల్లిమొగ్గలు వేస్తోంది. ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శించినా.. వెంటనే రంగంలోకి దిగుతున్న సీఎం జగన్ అదిగో అప్పటి కల్లా రోడ్లు బాగుచేయండి.. గుంతలు కనిపించడానికి వీల్లేదు.. అని ఆదేశాలు ఇస్తున్నారు. తరువాత ఆ మాటే మరిచిపోతున్నారు. ఏడాది కిందట సేమ్ టూ సేమ్ ఇవే ఆదేశాలిచ్చారు. తరువాత మడమ తిప్పేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి సమీక్షించి వచ్చే ఏడాది వరకూ రహదారుల అభివ్రుద్ధి గడువును పొడిగించారు. అంటే, మరో ఏడాది వరకు రాష్ట్రంలో గతుకులు, గుంతలు, గోతుల రోడ్లే ఉంటాయని చెప్పకనే చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లపాటు రహదారి మరమ్మతులు సరిగ్గా చేపట్టని సర్కారు, రోడ్లు ఎందుకు బాగోలేదని ఎవరైనా ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వ వైఫల్యమంటూ నెట్టుకొచ్చింది. కేవలం రహదారుల అభివ్రుద్ధికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి 2వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది ఏపీ సర్కారు. నిర్దిష్టకాలంలో రహదారి మరమ్మతులు చేపట్టలేక, గడువును మరో ఏడాదికి పొడిగించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంమవుతోంది. గడిచిన మూడేళ్లకాలంలో సర్కారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులు ఎన్ని? వాటి విస్తీర్ణం ఎంత అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు చెబుతూ.. వాటిని తన ఖాతాలో వేసుకుంటోంది. సర్కారు చెబుతున్న అధికారిక లెక్కల ప్రకారం ఏటా 8 వేల కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాలి. గోతులు పడి పాడైన వాటికి మరమ్మతు పనులు చేపట్టాలి. ఆ లెక్కన మూడేళ్ల వ్యవధిలో 24 వేల కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. దీనికోసం సర్కారుకు నికరంగా రూ.6,000 కోట్లు అవసరం. రహదారుల మరమ్మతుల పేరుతోనే పెట్రోల్‌, డీజిల్‌పై సెస్సు వసూలు చేస్తున్నారు. కానీ, ఆ నిధులను సర్కా రు సొంత అవసరాలకు వాడుకుంటోంది. రోడ్లకోసం రూపాయి కూడా వినియోగించలేదు.

Roads Will Be Repaired After One Year
Damaged Roads

Also Read: Rythu Bharosa: ఇదేనా రైతుకు భరోసా? ఐదున్నర వేలుతో సరిపెడుతున్నారా?

పక్క రాష్ట్రాలకు చులకన..

ఇప్పటికే పక్కరాష్ట్రం మంత్రులు ఏపీలోని రోడ్ల పరిస్థితిపై బహిరంగ వేదికలపైనే వేలెత్తిచూపిస్తున్నారు. వాటిపై సీఎం పెదవి విప్పకుండా, మరో ఏడాదిలో రోడ్లు బాగుండాలని చెప్పడం విస్మయం కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, సొంత అవసరాలకు ‘రహదారులు’ భలేగా ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో రోడ్ల అభివ్రద్ధికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి ప్రభుత్వం రూ.2 వేల కోట్లు అప్పు తెచ్చుకుంది. ఆ నిధులతో 8,268 కిలోమీటర్ల రహదారుల మరమ్మతులు చేపడతామని గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. 308 పనులు స్టేట్‌హైవేలపై, 853 పనులు జిల్లా ప్రధాన రహదారులపై విభజించి మొత్తం 1160 పనులు చేపడతామని పేర్కొంది. వీటి పనులు సాగుతున్నాయి. సీఎం గతంలో చెప్పిన దాని ప్రకారం ఈ రహదారి మరమ్మతు పనులను ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేయాలి. వర్షాకాలం ప్రారంభానికి ముందే రహదారి రిపేర్లు పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీకి దిశానిర్దేశం చేశారు. వాస్తవంగా ఏటా 8వేల కిలోమీటర్ల చొప్పున రోడ్ల నిర్వహణ చేపట్టాలి. జగన్‌ సర్కారు వచ్చి మూడేళ్లయింది. ఈ లెక్కన 24వేల కిలోమీటర్ల మెయింటెనెన్స్‌ చేపట్టాలి. కానీ సర్కారు చేపట్టిన పనులు 8వేల కిలోమీటర్ల పరిధిలోనివే. మరి మిగిలిన 16వేల కిలోమీటర్ల రహదారుల మాటేమిటి? అనేదానిపై సమాధానం లేదు. ఎందుకంటే, సర్కారు తొలిదశలో చేపట్టిన 8వేల కిలో మీటర్ల రోడ్లలో సగమే నిర్వహిస్తోంది. వాటికే నిధులు పూర్తిగా చాలడం లేదు. మరి పూర్తిగా చేపట్టాలంటే మరో రూ.2 వేల కోట్లపైనే కావాలి. ఇదికాక, 16 వేల కిలో మీటర్ల రహదారుల నిర్వహణకు మరో రూ.4 వేల కోట్లు అవసరం. వాటిని ఎలా సమకూరుస్తారన్నది మరో పెద్ద ప్రశ్న. సీఎం చెబుతున్న రెండో ఏడాది గడువులోగా మరో 8వేల కిలో మీటర్ల రోడ్లు వార్షిక మెయింటెనెన్స్‌కు వస్తాయి. అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తుంది. అప్పటికీ పాతటార్గెట్లు పూర్తిచేయకున్నా, కొత్త టార్గెట్‌లోని రహదారులను అభివృద్ధి చేయకుంటే రహదారుల పరిస్థి తి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Roads Will Be Repaired After One Year
Y S Jagan

వాస్తవం మరుగునపెట్టి..

వాస్తవ పరిస్థితిని మరుగునపెట్టి సీఎం జగన్ భలేగా మేనేజ్ చేస్తున్నారు. నిధులుంటే తప్ప రోడ్లు పనులు కావని, అందుకే సీఎం వ్యూహాత్మకంగా రహదారి మరమ్మతు పనుల డెడ్‌లైన్‌ను పొడిగించుకుంటూ పోతున్నారని ఇంజనీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన మరో ఏడాది పాటు ప్రయాణికులకు గుంతలు, గోతుల రోడ్లపై నరకయతాన తప్పదు. ఇదిలావుంటే, దేశంలో ఏ రాష్ట్రం చేయనంత ప్రజాసంక్షేమం, అభివృద్ధి ఏపీలో వైసీపీ సర్కారే చేస్తోందంటూ పెద్ద ఎత్తున కరపత్రాలు ముద్రించారు. అయితే, దానిలో రోడ్ల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

Also Read: Russia-China Presidents: ప్రపంచంలోనే అత్యంత శక్తవంతమైన అధ్యక్షులు. కానీ వాళ్ళు బతకటం కష్టమే!

Recommended Videos:

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular