https://oktelugu.com/

రైతుల కోసం ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పిన ఆర్ఎల్పీ..!

కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి ఆర్ఎస్పీ పార్టీ గుడ్ బై చెప్పింది. రైతులకు వ్యతిరేకంగా ఏ పార్టీ.. కూటమి పని చేసినా తాము మద్దతు ఇవ్వబోమని ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బేనివాల్ స్పష్టం చేశారు. Also Read: 14 సంవత్సరాలుగా అన్నం తినని బాలిక.. ఎలా బ్రతుకుతోందంటే..? కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వెనక్కి తీసుకోవాలని రైతులు నెలరోజులుగా ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. వీరితోపాటు రాజస్థాన్ రాష్ట్రంలోని అళ్వార్ జిల్లాలోనూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2020 8:12 pm
    Follow us on

    Rajasthan

    కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి ఆర్ఎస్పీ పార్టీ గుడ్ బై చెప్పింది. రైతులకు వ్యతిరేకంగా ఏ పార్టీ.. కూటమి పని చేసినా తాము మద్దతు ఇవ్వబోమని ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బేనివాల్ స్పష్టం చేశారు.

    Also Read: 14 సంవత్సరాలుగా అన్నం తినని బాలిక.. ఎలా బ్రతుకుతోందంటే..?

    కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వెనక్కి తీసుకోవాలని రైతులు నెలరోజులుగా ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. వీరితోపాటు రాజస్థాన్ రాష్ట్రంలోని అళ్వార్ జిల్లాలోనూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.

    రైతుల దీక్షకు తాజాగా ఆర్ఎల్పీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బేనివాల్ రైతులకు మద్దతుగా మాట్లాడారు. రైతులకు వ్యతిరేకంగా ఏ పార్టీ.. కూటమి పని చేసినా తాము మద్దతు ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు.

    రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించకుంటే ఎన్డీఏ నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే ఆర్ఎల్పీ ప్రకటించింది. ఈక్రమంలోనే తాజాగా ఎన్డీఏ నుంచి తప్పుకుంటున్నట్లు ఆర్ఎల్పీ చీఫ్ హనుమాన్ బేనివాల్ ప్రకటించారు.

    Also Read: విశాఖలో తీవ్ర ఉద్రిక్తత: టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ

    ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి శివసేన.. శిరోమి అకాలీదళ్ పార్టీలు గుడ్ బై చెప్పాయి. తాజాగా ఈ లిస్టులోకి రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) చేరింది.

    ఇదిలా ఉంటే కేంద్రంతో చర్చించేందుకు రైతులు మరోసారి సిద్ధమయ్యారు. డిసెంబర్ 29వ తేదీ ఉదయం 11గంటలకు కేంద్రంతో చర్చలకు సిద్ధమేనని రైతులు ప్రకటించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్