https://oktelugu.com/

ఆదాయపు పన్ను చెల్లించే వారికి అదిరిపోయే శుభవార్త.. ?

ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న సంగతి తెలిసిందే. 2019 – 2020 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరితేదీగా ఉన్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లించే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. జాబ్ ఫట్ ప్రాసెసింగ్ పేరుతో ఒక కొత్త ఫీచర్ ను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో సులభంగా ఆదాయపు పన్నును […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 26, 2020 / 08:40 PM IST
    Follow us on


    ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న సంగతి తెలిసిందే. 2019 – 2020 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ చివరితేదీగా ఉన్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లించే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. జాబ్ ఫట్ ప్రాసెసింగ్ పేరుతో ఒక కొత్త ఫీచర్ ను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తెచ్చింది.

    ఈ ఫీచర్ సహాయంతో సులభంగా ఆదాయపు పన్నును చెల్లించడం సాధ్యమవుతుంది. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల కోసం ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ సహాయంతో ఐటీఆర్ రిటర్న్ లను త్వరితగతిన దాఖలు చేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 లను దాఖలు చేయవచ్చు. అయితే ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుపై కనీస అవగాహన ఉన్నవారు మాత్రమే ఈ ఫీచర్ ను ఉపయోగించాలి.

    ప్రతి సంవత్సరం జులై 31వ తేదీ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి చివరి తేదీగా ఉంటుంది. ఈ ఏడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కేంద్రం ఉద్యోగులు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 2020 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. డిసెంబర్ 31లోగా అడిట్ అవసరం లేని వాళ్లు రిటర్నులను దాఖలు చేయాలి.

    ఎవరైనా అడిట్ అవసరమై రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటే వాళ్లు 2021 సంవత్సరం జనవరి 31వ తేదీలోగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయకపోతే వీలైనంత త్వరగా రిటర్నులను దాఖలు చేస్తే మంచిది.