https://oktelugu.com/

ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఆ యాప్ తో అన్ని సేవలు పొందే ఛాన్స్..?

ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచటానికి ఆర్టీసీ ఒక కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ మూడు వేర్వేరు యాప్ ల ద్వారా సర్వీసులను అందిస్తుండగా ఇకపై ఒకే యాప్ తో ప్రయాణికుల సమస్యలన్నీ తీరనున్నాయి. అతి త్వరలో యాప్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏపీఎస్‌ఆర్టీసీ సైతం టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందడుగులు వేస్తోంది. ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 26, 2020 / 07:15 PM IST
    Follow us on


    ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచటానికి ఆర్టీసీ ఒక కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ మూడు వేర్వేరు యాప్ ల ద్వారా సర్వీసులను అందిస్తుండగా ఇకపై ఒకే యాప్ తో ప్రయాణికుల సమస్యలన్నీ తీరనున్నాయి. అతి త్వరలో యాప్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

    మారుతున్న కాలానికి అనుగుణంగా ఏపీఎస్‌ఆర్టీసీ సైతం టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందడుగులు వేస్తోంది. ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానున్న ఈ యాప్ సహాయంతో 10 నుంచి 15 రకాల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. ప్రయాణికుడు ఒక బస్ కు రిజర్వేషన్ చేసుకుని ఏదైనా కారణం చేత మిస్ అయితే మరో బస్ లో ప్రయాణం చేసే అవకాశం అందుబాటులోకి రానుంది.

    ఏపీఎస్‌ఆర్టీసీ ఈ యాప్ ద్వారా ప్రయాణికుల కష్టాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. అన్ని మార్గాలలో బస్ లలో ఖాళీలను సులభంగా ప్రయాణికులు తెలుసుకోవచ్చు. 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ యాప్ కు సంబంధించిన టెండర్లు ఖరారు కానున్నాయని సమాచారం.

    ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని బస్సులకు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే కొత్త యాప్ ద్వారా పల్లె వెలుగు, ఇతర బస్సులకు కూడా రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలను యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.