Revanth Reddy Chandra Babu: రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఇప్పుడు ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబే.. మొదటి టీఆర్ఎస్ లో ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డిని ఎంకరేజ్ చేసి పార్టీలో కీలక స్థానం ఇచ్చి ప్రోత్సహించి ఇంతవాడిని చేసింది ఆయనే. అందుకే చాలా సార్లు తన ‘గాడ్ ఫాదర్’ చంద్రబాబు అని నిర్మోహమాటంగా చెబుతుంటాడు రేవంత్.
అయితే తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడం.. టీడీపీలో కీలక స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం.. ఎంపీ అవ్వడం.. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ వరకు ఎదగడం తెలిసిందే. అయితే రేవంత్ ఎదుగుదల వెనుక చంద్రబాబు ఉన్నారని.. ఆయన సిఫారసు మేరకే సోనియా గాంధీ ఈ పీఠాన్ని ఇచ్చారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక రేవంత్ దూకుడు.. కేసీఆర్ ను ఎదుర్కొనే తీరు.. ప్రజల్లో ఉద్యమాలు చేసే వైనమే ఆయనకు పదవి దక్కేలా చేసిందనే వారు ఉన్నారు.
అయితే ఇటీవల టీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పక్కా టీడీపీ వాది అని.. చంద్రబాబు తొత్తు అని మంత్రి కేటీఆర్ విమర్శించాడు. కాంగ్రెస్ కు దిక్కు లేక చంద్రబాబు శిష్యుడిని పట్టుకొచ్చారని విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులంతా ఇప్పుడు ఇదే ఆరోపిస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోయాయి.
తాజాగా రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. టీడీపీపైనా చంద్రబాబుపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికే టీడీపీ నుంచి బయటకు వచ్చానని.. రాజకీయ విలువను గౌరవిస్తానన్న రేవంత్ .. చంద్రబాబును తాను ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు. తిట్టడం లేదని బాబు మనిషి అంటున్నారా? అనిప్రశ్నించారు. తెలంగాణతో చంద్రబాబుకు సంబంధం లేదని.. ఏ సంబంధం లేని చంద్రబాబును తాను ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు.
ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టి విజయవంతం చేయడం ద్వారానే తనపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు నమ్మకం ఏర్పడి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
మొత్తం తన గురువు అయిన చంద్రబాబును కూడా ఇప్పుడు తెలంగాణలో రాజకీయం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మాటలు అనాల్సిన పరిస్థితుల్లో పడ్డారని.. చంద్రబాబు వల్ల ఇబ్బందుల్లో పడుతున్నారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.