Revanth Reddy: కేసీఆర్ దున్నపోతు కంటే అధ్వానంగా అయ్యాడు: రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేసీఆర్ దున్నపోతు కంటే అద్వాన్నంగా అయ్యాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి అచోసిన ఆంబోతులాగా తయారయిండని నిప్పులు చెరిగారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు రోడ్ వేస్తే గ్రామంలో కుమ్మరి ఎలవ్వ ఇల్లు పోయింది.. ఒక్క ఇల్లు కట్టిస్తే నీ ముల్లె పోతాదా.. అని నిలదీశారు. ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారని..ఇదే గ్రామంలో ధరణి పోర్టల్ ను ప్రారంభించారన్నారు. ఈ గ్రామంలోనే ధరణి లో అనేక […]

Written By: NARESH, Updated On : May 24, 2022 12:49 pm
Follow us on

Revanth Reddy: కేసీఆర్ దున్నపోతు కంటే అద్వాన్నంగా అయ్యాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి అచోసిన ఆంబోతులాగా తయారయిండని నిప్పులు చెరిగారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు రోడ్ వేస్తే
గ్రామంలో కుమ్మరి ఎలవ్వ ఇల్లు పోయింది.. ఒక్క ఇల్లు కట్టిస్తే నీ ముల్లె పోతాదా.. అని నిలదీశారు.

Congress Seniors vs Revanth Reddy

ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారని..ఇదే గ్రామంలో ధరణి పోర్టల్ ను ప్రారంభించారన్నారు. ఈ గ్రామంలోనే ధరణి లో అనేక సమస్యలున్నాయన్నారు. 582 మందికి ఖాతా నెంబర్లు లేవు.. ఈ గ్రామానికి రెవెన్యూ నక్ష లేదని రేవంత్ విమర్శించారు. దీంతో గ్రామంలో రైతు బంధు పథకం లేదు.. రైతు భీమా రావడం లేదన్నారు.పాస్ పుస్తకాలు లేకపోవడం తో రైతులకు చాలా నష్టాలు వస్తున్నాయన్నారు.

గ్రామంలో పూర్తిగా సర్వే చేయించి టీ పన్ ప్రకారం సమస్యలు పరిష్కరించాలని రేవంత్ సూచించారు. కలెక్టర్ వెంటనే కట్టివ్వకపోతే కాంగ్రెస్ తగిన గుణపాఠం చెపుతామన్నారు. కుమ్మరి ఎల్లవ్వకు ఇల్లు కట్టిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీస్కుంటదని స్పష్టం చేశారు.

ఈ గ్రామంలో ధరణి పోర్టల్ ప్రారంభిస్తే ఇక్కడే నక్ష లేదు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాగానే నెల రోజుల్లో ఇదే గ్రామంలో అందరికి పాసు పుస్తకాలు ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల వద్దకు వచ్చి 2500 క్వింటాల్ వరి కొంటామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి కొంటాం. కూరగాయలు పండ్లు కూడా మంచి ధరలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

వరంగల్ డిక్లరేషన్ తర్వాత 15 రోజులు ఫామ్ హౌస్ లో తాగి పండుకొని ఇపుడు లేసి ఢిల్లీకి పోయి పంజాబ్ రైతులకు చెక్ లు ఇస్తుండని రేవంత్ కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మనం పన్నులు కడితే మన రైతులకు పరిహారం ఇవ్వడని… ఇక్కడ కుమ్మరి ఎల్లమ్మకు ఇల్లు ఇవ్వడు కానీ పంజాబ్ కుపోయి అక్కడ రైతులకు చెక్ లు ఉస్తాడట…ఈ గాడిద కొడుకు అని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఇక్కడ రైతులకు న్యాయం చేయనోడు పంజాబ్ లో ఎలాగబెడుతాడట అని రేవంత్ విమర్శించారు.ఇక్కడ సమస్యలు పరిష్కరించి ఇతర ప్రాంతాలకు పోతే మాకు అభ్యంతరం లేదని అన్నారు. ఇక్కడ రైతులు నానా కష్టాలు పడుతుంటే పంజాబ్ రైతులకు రాజకీయ స్వార్థం తోటి చెక్ లు ఇచ్చి రాజకీయాలు చేస్తుండు..

రైతు డిక్లరేషన్ ను 12 వేల గ్రామాలలో ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. కేసీఆర్ గద్దె దిగితేనే రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. నాలుగు రోజులు కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రంలో ఇకపోతే తెలంగాణ సంతోషంగా ఉందన్నారు. మొత్తమే కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ పొలిమేర దాటిస్తే తెలంగాణ సంతోషంగా ఉంటుందన్నారు.

మంత్రి మల్లారెడ్డి, ఆయన బావమరిది భూ కబ్జాలు, అక్రమాలు, అవినీతిపైన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామన్నారు. కేసీఆర్ నిజాయితీ పరుడు అయితే నేను నిర్దిష్టంగా ఆరోపణలు చేస్తున్న.. విచారణ సంస్థలను పంపండి నిరూపిస్తామన్నారు.. నిరూపించకపోతే ఎలాంటి చర్యకైనా సిద్ధమన్నారు.
Recommended videos