Bandi Sanjay: ‘బండి’ పాదం ఆగనంటోంది.. మరో యాత్రకు రె‘ఢీ’

Bandi Sanjay: ఇప్పటికే రెండు విడతలుగా తెలంగాణలో పాదయాత్ర నిర్వహించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ తన మూడో పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. జూన్ 23 నుండి జూలై 12 వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టున్నట్టు ప్రకటించారు.ఇక ఆగస్టులోపు 4వ విడత పాదయాత్రనూ పూర్తి చేస్తానని ప్రకటించారు. ఈసారి ఉద్యమ గడ్డ అయిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించేందుకు రెడీ అయ్యారు. ఈ […]

Written By: NARESH, Updated On : May 24, 2022 12:48 pm
Follow us on

Bandi Sanjay: ఇప్పటికే రెండు విడతలుగా తెలంగాణలో పాదయాత్ర నిర్వహించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ తన మూడో పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు. జూన్ 23 నుండి జూలై 12 వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టున్నట్టు ప్రకటించారు.ఇక ఆగస్టులోపు 4వ విడత పాదయాత్రనూ పూర్తి చేస్తానని ప్రకటించారు.

ఈసారి ఉద్యమ గడ్డ అయిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు బండి సంజయ్ పాదానికి రెస్ట్ లేకుండా విడతల వారీగా పాదయాత్రకు రంగం సిద్ధం చేశారు.

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వచ్చే నెల 23 నుంచి జూలై 12 వరకు మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. మూడో విడత పాదయాత్ర మొత్తం 20 రోజులపాటు కొనసాగనుంది. అట్లాగే 4వ విడత పాదయాత్రను సైతం ఆగస్టులోపు పూర్తి చేయనున్నారు. మొత్తంగా 3, 4 విడతల పాదయాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు.

•బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు, నాలుగో విడత పాదయాత్రలను ఎక్కడి నుండి ప్రారంభించి ఎక్కడ ముగింపు చేస్తారనే విషయంపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

• మొదటి, రెండో విడత పాదయాత్రల్లో భాగంగా బండి సంజయ్ 67 రోజులు పాదయాత్ర చేసి 828 కిలోమీటర్లు నడవడమే కాకుండా దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు.

•రెండు విడతల పాదయాత్రల్లో భాగంగా 13 జిల్లాల్లోని 9 ఎంపీ, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడవడంతోపాటు 66 సభలు నిర్వహించామని పేర్కొన్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులుగా, ఎంపీగా కొనసాగుతున్నందున రాష్ట్ర హెడ్ క్వార్టర్లో, పార్లమెంట్ సమావేశాలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉన్నందున…. జాతీయ నాయకత్వం సూచన మేరకు ప్రతినెలా 20 రోజులపాటు పాదయాత్ర చేస్తారని… మిగిలిన 10 రోజులు ఆయా కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
Recommended videos