కరోనా తప్పుడు లెక్కలపై రేవంత్ ఫైర్..!

తెలంగాణలో కరోనా లెక్కలు గందగోళంగా మారుతోన్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు.. ప్రభుత్వ ఆరోగ్యశాఖ చెబుతున్న లెక్కలకు ఎక్కడ పొంతన కుదరడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నవేళ కరోనా కేసుల్లో గందరగోళం నెలకొనడంపై పలు అనుమానాలను రెకేత్తిస్తున్నాయి. ఈ విషయంలో విపక్షాలు పదేపదే విమర్శలు చేస్తున్న ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా లెక్కలపై ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిన విషయాన్ని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు. కరోనా విజృంభణ.. […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 2:54 pm
Follow us on


తెలంగాణలో కరోనా లెక్కలు గందగోళంగా మారుతోన్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు.. ప్రభుత్వ ఆరోగ్యశాఖ చెబుతున్న లెక్కలకు ఎక్కడ పొంతన కుదరడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నవేళ కరోనా కేసుల్లో గందరగోళం నెలకొనడంపై పలు అనుమానాలను రెకేత్తిస్తున్నాయి. ఈ విషయంలో విపక్షాలు పదేపదే విమర్శలు చేస్తున్న ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా లెక్కలపై ప్రభుత్వాన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిన విషయాన్ని విపక్ష నేతలు గుర్తు చేస్తున్నారు.

కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు

టీఆర్ఎస్ సర్కార్ కరోనాపై కాకిలెక్కలు చెబుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కరోనా కేసుల విషయంలో తప్పుడు లెక్కలు చూపుతుందని ఆరోపించారు. ప్రభుత్వం రోజువారీగా విడుదల చేస్తున్న బులిటెన్ కు, తెలంగాణ ఆరోగ్య శాఖ డ్యాష్ బోర్డులో చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదని పేర్కొన్నారు. గురువారం వరకు రాష్ట్రంలో 18,570 పాజిటివ్ కేసులుండగా తెలంగాణ ఆరోగ్య శాఖ డాష్ బోర్డులో ఆ సంఖ్య 21,393గా ఉందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కరోనా లెక్కలు ఎందుకు దాస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

తెలంగాణలో కేసులు సంఖ్యను ప్రభుత్వం కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలను రేవంత్ ఆయన ట్వీటర్లో ట్వీట్ చేశారు. మీడియాలో విడుదల చేసిన బులిటెన్ కు.. డాష్ బోర్డులో కన్పిస్తున్న లెక్కలకు 3వేల తేడా ఉందన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి చేయకుండా లెక్కలు తక్కువ చేసి చూపడం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనమో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కరోనా కట్టడి విషయంలో చెబుతున్న మాటలకు ఆచరణలో ఎక్కడ పొంతన లేకుండా పోతుందని విమర్శించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు మరింత పెరగక ముందే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కరోనా మహమ్మరి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం.