సీఎం జగన్ కు ఎంపీ రఘురామ స్పెషల్ రిక్వెస్ట్..!

సొంత పార్టీలోనే వైరిపక్షంలా ఎంపీ రఘురామరాజు వ్యవహరిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ తరపున రఘురామరాజు పోటీ చేసి గెలుపుపొందాడు. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఎంపీలకు అపాయిట్మెంట్ ఇవ్వడంలేదని.. తాను సొంతబలంతోనే గెలిచానంటూ మీడియాలో చెప్పడంతో ఆయనపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఆయన వ్యాఖ్యలు చిలికిచిలికి గాలివానలా మారడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం యత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే రఘురామరాజు సీఎం జగన్ లేఖ రాయడం […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 2:51 pm
Follow us on


సొంత పార్టీలోనే వైరిపక్షంలా ఎంపీ రఘురామరాజు వ్యవహరిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ తరపున రఘురామరాజు పోటీ చేసి గెలుపుపొందాడు. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఎంపీలకు అపాయిట్మెంట్ ఇవ్వడంలేదని.. తాను సొంతబలంతోనే గెలిచానంటూ మీడియాలో చెప్పడంతో ఆయనపై పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఆయన వ్యాఖ్యలు చిలికిచిలికి గాలివానలా మారడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం యత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే రఘురామరాజు సీఎం జగన్ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.

జగన్ ని పొగడడం వెనుక పవన్ వ్యూహం భేష్..!

సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో రఘురామరాజు ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు అల్లూరి సీతరామరాజు పేరు పెట్టాలని కోరారు. గత పాదయాత్ర సమయంలోనే సీఎం ప్రజలకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారికంగా జిల్లా పేరును ప్రకటిస్తే ప్రజలు సంతోషిస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. వైసీపీలోనే ఆయనపై వ్యతిరేక వస్తున్న తరుణంలోనే ఆయన నేరుగా సీఎం జగన్ కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.

మరోవైపు ఎంపీ రఘురామరాజుకు సొంత పార్టీ నేతలపై, ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈమేరకు ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని గడువు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆయన ఎన్నికల సంఘాన్ని కలిసి వైసీపీలో క్రమశిక్షణ సంఘం ఉందా? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చాక సమాధానం పంపుతానని చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో క్రమశిక్షణ కమిటీ లేదని స్పష్టం చేశారు. అయితే తనకు పార్టీ నేతలు పంపిన షోకాజ్ సమాధానం కాకుండా రిప్లై ఇస్తున్నట్లు ట్వీస్ట్ ఇచ్చారు.

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

దీంతో ఎంపీ రఘురామ తీరును వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఆయన వ్యవహారం పార్టీకి నష్టం కలిగించేలా ఉండటంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది. ఈమేరకు వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసి వేటు వేసేలా పావులు కదుపుతున్నారు. ఈ సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి రఘురామరాజు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే విధేయుడినని.. మిగతా వారికి కాదని తెలియజేందుకే లేఖ రాశాడనే ప్రచారం జరుగుతోెంది. అయితే రఘురామరాజు లేఖకు సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!