Revanth Reddy- Drugs Case: తెలంగాణలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం దినదినం వెలిగిపోతోంది. పెద్దవాళ్ల అండదండలతో లాభసాటి వ్యాపారంగా మారుతోంది. మొదట అలవాటు చేసుకుని తరువాత వ్యాపారులుగా మారుతున్నారంటే అందులో ఎంత లాభం ఉందో తెలిసిపోతోంది. ఇటీవల కాలంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇదే దందాలో లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది.
ఉగాది రోజున రాడిసన్ బ్లూ హోటల్ లో దాదాపు 150 మంది పట్టుబడినా ప్రభుత్వం అందరిని వదిలేయడం విమర్శలకు తావిచ్చింది. అందులో పెద్ద వాళ్ల పిల్లలు ఉన్నారనే కారణంతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్కడ డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు దొరికిని ఎవరిపై కూడా చర్యలు తీసుకోలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం విమర్శలను మూటగట్టుకుంది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టు మెట్లు ఎక్కారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో సినిమా వాళ్ల హస్తం ఉన్నా సర్కారు మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
Also Read: Kapu Politics: రాక్షక క్రీడకు తెరతీసిన జగన్.. కాపు సామాజికవర్గంలో రాజకీయ చిచ్చు
గతంలో కూడా సినిమా వాళ్ల మీద పెట్టిన కేసులన్నీ లెక్కలోకి లేకుండా పోయాయి. దీంతో రేవంత్ రెడ్డి అప్పటి నుంచే న్యాయపోరాటం చేస్తున్నారు. డ్రగ్స్ వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పదేపదే చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కేసు కొలిక్కి రాకుండా పోతోంది. ఫలితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరుతున్నా పెడచెవిన పెడుతోంది. డ్రగ్స్ విషయంల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నారు. ఇదివరకే సినిమా వాళ్లు చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గతంలో నివేదికలు ఇచ్చినా సర్కారు మాత్రం వారిని వెనకేసుకొస్తోంది. దీంతో డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం డ్రగ్స్ వ్యాపారం రాష్ట్రంలో జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. సర్కారు మాత్రం దీని విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇదివరకు దొరికిని నిందితులు సైతం భయానికి గురికావడం లేదు. ఎందుకంటే వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలో ఎవరికి కూడా భయం లేకుండా పోతోంది. ఇప్పుడు డ్రగ్స్ రాకెట్ కుంభకోణాలు వెలుగులోకి వస్తన్నా సర్కారు నిర్లక్ష్యంతోనే నీరుగారిపోతున్నాయనేది నిత్య సత్యం. కానీ ప్రభుత్వం మాత్రం డ్రగ్స్ కేసులను పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. అందుకే రేవంత్ రెడ్డి న్యాయపోరాటం బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది.
Also Read:Revanth Reddy: కేసీఆర్ ను నమ్మనోడే బాగుపడ్డాడు.. రేవంత్ హాట్ కామెంట్స్
Recommended Videos