Megastar Chiranjeevi: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఇదే క్రేజ్ వినిపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే పాన్ ఇండియా మూవీ అనేది ఇన్ని రోజులకు మనం చూస్తున్నాం కానీ.. చిరంజీవి ఆ తరంలోనే బహు భాషా నటులతో పాన్ ఇండియా మూవీ చేశారని మీకు తెలుసా.. ఆ వివేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సినీ ఇండస్ట్రీలో కౌ బాయ్ పాత్రకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి, కృష్ణ తరంలో ఈ తరహా సినిమలకు బాగా ప్రాముఖ్యత ఉండేది. అయితే మొదట్లో టాలీవుడ్‌ను కౌ బాయ్‌గా అలరించింది మాత్రం సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అప్పట్లో సంచలనం రేపింది. ఆ మూవీ తర్వాత సుమన్, అర్జున్ లాంటి వారు కూడా కౌబాయ్ పాత్ర చేసినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు.
Also Read: Revanth Reddy- Drugs Case: డ్రగ్స్ కేసును వదలని రేవంత్.. చిక్కుల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు
కాగా అప్పటికే మెగాస్టార్ గా ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న చిరంజీవితో సినిమా చేయాలనుకున్నారు నిర్మాత నాగేశ్వర్ రావు. అనుకున్నదే తడవుగా చిరును ఒప్పించి భారీ బడ్జెట్ తో కౌ బాయ్ మూవీ ప్లాన్ చేశారు. ఇక డైరెక్టర్ గా మురళీ మోహన్ రావును ఫిక్స్ చేశారు. హాలీవుడ్ లో వచ్చిన టాప్ 10 కౌబాయ్ సినిమాల ఆధారంగా కొదమ సింహం మూవీ కథ రాశారు.
ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా సెట్లు వేశారు. ఎందుకంటే కౌబాయ్ మూవీలో ఎలాంటి కరెంట్ పోల్స్, రోడ్లు లాంటివి కనిపించకూడదు. అందుకే ప్రత్యేక ప్రాంతాల్లో ఈ మూవీని షూట్‌చేశారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సోనమ్ నటించారు. ఇక అప్పటికే హీరోగా రాణిస్తున్న మోహన్ బాబు.. సుడిగాలి పాత్రలో ఒదిగిపోయారు.
ఇక బాలీవుడ్ నటులు ఇద్దురు, కన్నడ ప్రభాకర్ మరో విలన్‌గా నటించారు. ఇలా ఆ రోజుల్లోనే ఇతర భాషల నటులతో పాన్ ఇండియా మూవీగా రూ.4 కోట్ల బడ్జెట్ తో చేశారు. ఈమూవీని 1990 ఆగస్టు 9న ఈ మూవీని అన్ని భాషల్లో విడుదల చేయగా.. ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అన్ని భాషల్లో సెన్సేషన్ క్రియేట్‌చేసింది ఈ మూవీ. ఈ మూవీ శత దినోత్సవ వేడుకలు చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు. ఆ వేడుకకు రజినీకాంత్, వెంకటేశ్, రాజశేఖర్ లాంటి స్టార్లు హాజరయ్యారు. అలా ఆ కాలంలోనే పాన్ ఇండియా మూవీ చేశారు మెగాస్టార్.
Also Read:Nani Thaman: ముదురుతున్న హీరో నాని – థమన్ మధ్య వివాదం..అసలు ఏమి జరిగిందో తెలుసా??
Recommended Videos: