https://oktelugu.com/

గాయాలపై నివేదిక:గుంటూరు జైలుకు ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్ పంతం పట్టినట్టే కనిపిస్తున్నాడు. తనపై వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చ చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు తాజాగా వైద్య పరీక్షల అనంతరం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తనపై పోలీసులు దాడి చేశారని ఎంపీ రఘురామ జడ్జీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జీజీహెచ్ క్యాన్సర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా జైలుకు తరలించారు. ఎంపీ రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా […]

Written By: , Updated On : May 16, 2021 / 06:57 PM IST
Follow us on

ఏపీ సీఎం జగన్ పంతం పట్టినట్టే కనిపిస్తున్నాడు. తనపై వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చ చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇప్పటికే అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు తాజాగా వైద్య పరీక్షల అనంతరం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

తనపై పోలీసులు దాడి చేశారని ఎంపీ రఘురామ జడ్జీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జీజీహెచ్ క్యాన్సర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా జైలుకు తరలించారు. ఎంపీ రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎంపీ రఘురామకు అయిన గాయాలపై మెడికల్ బోర్డును కోర్టు ఏర్పాటు చేసింది. దీంతో వారు 18 రకాల వైద్య పరీక్షలను ఎంపీ రఘురామకు చేస్తున్నారు. కాసేపట్లో జిల్లా మెడికల్ బోర్డు.. కోర్టుకు నివేదికను ఇవ్వనుంది. కోర్టు ఆదేశాలతో రఘురామ గాయాలపై గత రాత్రి నుంచి పరీక్షలు కొనసాగుతున్నాయి. అనంతరం నివేదికను జీజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలోని మెడికల్ బోర్డు పరీక్షలు చేసి నివేదికను ఉదయం 10.30 గంటలకే జిల్లా కోర్టు.. మధ్యాహ్నం 12 గంటల్లో హైకోర్టు డివిజన్ బెంచ్ కు ఇవ్వాల్సి ఉంది. అయితే పరీక్షలు చేయడంలో జాప్యం జరగడంతో ఆలస్యమైంది.

ఇక పరీక్షలు ముగిసిన తర్వాత జిల్లా నుంచి హైకోర్టు వైద్య బృందం నివేదిక అందించింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి ప్రత్యేక మెసేంజర్ ద్వారా కోర్టు నివేదిక పంపారు. మరికాసేపట్లో విచారణ చేపట్టి దీనిపై కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.

రఘురామను పోలీసులు కొట్టారా? లేక ఆయనకున్న వ్యాధులు కారణంగా ఈ గాయాలు బయటపడ్డాయా? అన్నది మెడికల్ బోర్డు నివేదికలో బయటపడనుంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.