
తెలంగాణలో కరోనా మహమ్మారి కల్లోలం క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో మరో 5,892 మంది చికిత్సకు కోలుకున్నారు. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,28,823 కు పెరిగాయి. యాక్టివ్ కేసులు 50,969కి చేరాయి. వైరస్ ఇన్ ఫెక్షన్ కారణంగా 2,955 మంది ప్రాణాలు కోల్పోయారు.