MAA Elections: మనిషి ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్లే ఆ మనిషి ప్రతిష్ట ఆ మనిషి పై ఉన్న గౌరవం పోతాయి. అందుకే ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండా ఏదైనా ఆలోచనతో చెయ్యాలంటారు. ‘మా’ ఎన్నికల వ్యాహారానికే వద్దాం. ఎన్నికల ఫలితాలు వచ్చాక, ఓడిపోయాం అని తెలిసాక కచ్చితంగా బాధ ఉంటుంది. అందుకే ప్రకాష్ రాజ్ కూడా చాలా బాధ పడ్డాడు. అయితే, ప్రకాష్ రాజ్ బాధ కంటే ఎక్కువ ఆవేశాన్ని ప్రదర్శించాడు.

ఫలితాలు వచ్చిన వెంటనే విరక్తి చెందాడు. ఎమోషనల్ అయ్యాడు. చివరకు ఆవేశంతో “మా” సభ్యుడిగా ఇక కొనసాగనని సగర్వంగా అధికారికంగా ప్రకటించుకున్నాడు. అన్నట్టుగానే తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. చేస్తే చేశాడు, ఆ తర్వాత తన ప్యానెల్ లో గెలిచినా 11 మంది చేత కూడా వారి పదవులకు రాజీనామా చేయించాడు.
మొత్తానికి ‘మా'(MAA Elections)కి రాజీనామా చేసినా సభ్యులుగా ఉంటామన్నారు. ఇక అంతా అయిపోయింది అనుకున్న తర్వాత, ప్రకాష్ రాజ్ కి ఎన్నికల రోజు ఏం జరిగింది అనే ఆలోచన వచ్చింది. కాబట్టి ఫలితాలు వచ్చిన ఐదు రోజుల తర్వాత, ప్రకాష్ రాజ్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కు సంబంధించిన సీసీ ఫుటేజీని చూడాలని ముచ్చట పడ్డాడు.
అసలు “మా” సభ్యుడిగా రాజీనామా చేసిన తర్వాత, పైగా తన ప్యానెల్ సభ్యులను కూడా వారి పదవి నుంచి రాజీనామా చేయించిన తర్వాత, తాపీగా ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలి అని ఎలా అడుగుతారు ? ఇక్కడే ప్రకాష్ రాజ్ ఒక పాయింట్ పట్టుకున్నాడు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటకింస్తూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశాడు.
మొత్తానికి ఎన్నికల అధికారి కూడా సీసీ ఫుటేజీ రెడీ చేశాడు. అయినా ఇప్పుడు ఈ ఫుటేజీలో మాత్రం ఏం ఉంటుంది ? ఏమైనా ఉంటే.. దాన్ని ప్రకాష్ రాజ్ కి ఎందుకు ఇస్తారు ? అసలు సభ్యుడిగా రాజీనామా చేయడం దేనికి ? ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేని వీడియోలు ఇవ్వమని అడగడం దేనికి ? ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ లో ఆవేశం, ఓవర్ యాక్షన్ తప్ప, ఆలోచన, ఒక మేనేజ్మెంట్ లేవని ఇక్కడే తేలిపోయింది కదా. అందుకే ఓడిపోయాడు.