Homeక్రీడలుIPL 2021 MS Dhoni: ఎంఎస్ ధోని.. ఓ క్రికెట్ మేధావి.. ఈ బుర్ర ఎలా...

IPL 2021 MS Dhoni: ఎంఎస్ ధోని.. ఓ క్రికెట్ మేధావి.. ఈ బుర్ర ఎలా వచ్చింది?

IPL 2021 MS Dhoni:  ఎంఎస్ ధోని.. సమకాలీన క్రికెట్లో ఇంతకు మించిన క్రికెట్ బుర్ర లేదంటే అతిశయోక్తి కాదు.. ఒక మారుమూల ‘జార్ఖండ్’ రాష్ట్రం నుంచి వచ్చిన ఒక వికెట్ కీపర్.. టీమిండియా ఎన్నడూ సాధించని విజయాలను కట్టబెట్టాడు. అంతేకాదు.. తను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఎంఎస్ ధోని క్రికెట్ బుర్రకు మరో ఐపీఎల్ ట్రోఫీ దాసోహమైంది. పోయిన 2020 ఏడాదిలో అట్టడుగున ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఏకంగా కప్ కొట్టేసింది. దీని వెనుకు ఉన్న మాస్టర్ మైండ్ ఒక్కడే.. అతడే ఎంఎస్ ధోని.. ఇది ఎలా సాధ్యమైంది?

ms dhoni
ms dhoni

మహేంద్ర సింగ్ ధోని ఆ మధ్య తన జీవిత చరిత్రపై తీసిన ‘ఎంఎస్ ధోని’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఈ ఫంక్షన్ కు హాజరై ధోని గురించి ఓ మాట చెప్పారు. ‘కర్మ యోగి ధోని’ అని.. ఆయనంటే నాకు స్ఫూర్తి అని కొనియాడారు.. ఎంతటి ఒత్తిడి, సమస్యలు ఎదురైనా చెక్కుచెదరని ధోనిని చూస్తే నాకు స్ఫూర్తి కలుగుతుందన్నారు. ప్రపంచకప్ ఫైనల్ చివరి బాల్ అయినా ధోనిలో ఎలాంటి భయం, బెరుకు, ఒత్తిడి లేదని.. సిక్స్ కొట్టి గెలిపించాక ఎలాంటి చలనం లేకుండా ఉన్న తీరు తనను షాక్ కు గురిచేసిందని రాజమౌళి ప్రశంసలు కురిపించారు. మిగతా వాళ్లంతా ఆనందంతో , కన్నీటి భాష్పాలు రాలుస్తుంటే ధోని లోని స్థైర్యం ఎంతో కట్టిపడేసిందన్నారు. అంతటి ఒత్తిడిని తాను కూడా తట్టుకోలేనని.. అందుకే ధోని కర్మ యోగి అంటూ రాజమౌళి మెచ్చుకున్నారు.

ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ఐపీఎల్ లో వరుసగా నాలుగో ట్రోఫీని ధోని నేతృత్వంలోని చెన్నై టీం గెలుచుకుంది. ఇప్పటివరకూ అందరినీ ఓడించి వచ్చిన భీకర కోల్ కతాను చెన్నై సునాయాసంగా ఓడించిందంటే అదంతా ధోని మహిమే. 10 ఓవర్లకు ఒక వికెట్ పడకుండా 90 పరుగులతో దూసుకుపోతూ గెలుపు ఖాయం అనుకున్న కోల్ కతాను ధోని తన తెలివితేటలతో వరుసగా వికెట్లు నేలకూల్చి ఓడిపోయేలా చేశాడు.

నిజానికి 2007 వన్డే ప్రపంచకప్ లో టీమిండియా చిత్తుగా ఓడాక సచిన్, గంగూలీ, ద్రావిడ్ పని అయిపోయింది. వారంతా తప్పుకునేందుకు రెడీ అయ్యారు. నాడు బీసీసీఐ అధ్యక్షుడిగా మరాఠా రాజకీయ నేత శరద్ పవార్ ఉండేవాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్ టీ20కి యువ జట్టును ఎంపిక చేయాలని.. సీనియర్లు అందరినీ పక్కనపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ద్రావిడ్ తప్పుకోవడంతో కొత్త కెప్టెన్ ఎవరన్నది బీసీసీఐ పెద్దలకు అర్థం కాలేదు.

ఈ క్రమంలోనే మాస్టర్ బ్లాస్టర్.. మహారాష్ట్రకే చెందిన సచిన్ టెండూల్కర్ అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ కు ఒక కీలక సూచన చేశాడట.. జట్టులో అరవీర భయంకర వీరేంద్రసెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి సీనియర్లు ఉన్నా కూడా ‘మహేంద్ర సింగ్ ధోని’ని కెప్టెన్ చేయాలని సూచించాడట..

ఇప్పటిదాకా ఒక పెద్ద రాష్ట్రం, పెద్ద సిటీ నుంచి వచ్చిన వారిని మాత్రమే టీమిండియా కెప్టెన్ చేసేవారు. కానీ చిన్న రాష్ట్రం.. మారుమూల రాంచీ పట్టణం నుంచి వచ్చిన ఎంఎస్ ధోనిని కెప్టెన్ చేశారు. సచిన్ టీంలో ఎంతో దగ్గరుండి ఆటగాళ్లను చూశాడు. ఆయనకు ధోనిలోని అణుకువ, నాయకత్వ లక్షణాలు, పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం కనిపించింది. ఆ సునిశిత పరిశీలననే ఇప్పుడు టీమిండియాకు గొప్ప కెప్టెన్ ను అందించింది. ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా నిలిపింది.

టాలెంట్ ఎక్కడ ఉందో గుర్తించడం.. దాన్ని సమర్థవంతంగా వాడుకోవడం.. ఫస్ట్రేషన్ కు గురికాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం ధోని ప్రత్యేకత.. ఒక కర్మ యోగిలా మిన్ను విరిగి మీద పడ్డ చలించని అతడి మనస్తత్వమే అతడి నాయకత్వాన్ని బలోపేతం చేసింది. ఆ జట్టును విజయతీరాలకు చేరుస్తోంది. ధోని ఇంతలా ఎదగడానికి అతడి కుటుంబం, కష్టపడ్డ తీరు, సామాజిక పరిస్థితులు, పేదరికం.. అతడు ఎదుర్కొన్న కష్టాలే కారణం. అదే అతడిని ఇంతడి ధృడచిత్తుడిని చేసింది. ‘ఎంఎస్ ధోని’ బయోపిక్ లో మనం ధోని ఒక టికెట్ కలెక్టర్ గా చేసి ఆ ఉద్యోగంలో మథన పడి చివరకు వదిలేసి క్రికెటర్ అయిన తీరును మనం గమనించాం.. ఆ సంఘర్షణే ధోనిని అత్యుత్తమ సారథిని చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

టీమిండియా కెప్టెన్ గానే కాదు.. ఐపీఎల్ లో చెన్నైని 8 సార్లు ఫైనల్ కు తీసుకెళ్లిన ఘనత ధోని సొంతం.. క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ కు ఇటీవలే వన్డే ప్రపంచకప్ ను అందించిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని బలమైన కోల్ కతా నైట్ రైడర్స్ ను సైతం ధోని ఓడించాడంటే అతి శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోనే మేధావి ఎవరంటే ధోని పేరు చెప్పొచ్చు.

అందుకే విరాట్ కోహ్లీ కూడా ట్వీట్ చేశాడు. ధోని క్రికెట్ బుర్రకు.. అతడి శక్తి సామర్థ్యాలను గుర్తించి ‘లయన్ ఈజ్ బ్యాచ్’ అంటూ కొనియాడారు. ధోని గెలిస్తే ప్రతి ఒక్కరూ సంతోషపడుతారు. ఎందుకంటే అతడు అందరివాడు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular