అప్ఘాన్ పరిణామాలు ఎంత శరవేగంగా మారుతున్నాయంటే ఎవరు ఎటువైపు ఉన్నారన్నది ఎవరికి అర్థం కావడం లేదు. నిన్నటి దాకా శత్రువులుగా ఉన్న అమెరికా, తాలిబన్లు ఇప్పుడు మిత్రులు. భాగస్వాములు అయ్యారు. ఐక్యరాజ్యసమితి తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా గుర్తించడం మానేసింది. తాలిబన్ ఉగ్రవాద పాత్రను ఇప్పుడు అప్ఘన్ లో ‘ఐసిస్-కే’ తీసుకుంది. అప్ఘన్ ఈ పరిణామాలంతా రెండు వారాల్లోనే జరగడం గమనార్హం.
ఒకటి రెండు ఘటనలు మినహా ఎటువంటి రక్తపాతం లేకుండా అప్ఘనిస్తాన్ లో అధికార మార్పిడి చాలా శాంతియుతంగా జరిగిందని చెప్పొచ్చు. నిన్నటిదాకా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థగా ఉన్న తాలిబన్ ఇప్పుడు అధికార సంస్థ అయ్యిందని.. దాని మిత్రులుగా ఉన్న ఐసిస్-కే లాంటివి ఇప్పుడు శత్రువులు అయిపోతున్నాయి.
అప్ఘన్ ను స్వాధీనం చేసుకోకముందు వరకూ పాకిస్తాన్, చైనా, ఉజ్జెకిస్తాన్, టర్కీ ఉగ్రవాద సంస్థలన్నీ తాలిబన్లతో అత్యంత మితృత్వం నరిపాయి. ఇప్పుడు తాలిబన్లు మా గడ్డ మీద ఇతర దేశాల ఉగ్రవాద సంస్థలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. అయితే ఐసిస్ అప్ఘాన్ లో బలపడితే మాత్రం తాలిబన్లకే ప్రమాదం. అదో ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకున్న కరుడుగట్టిన సంస్థ. అందుకే తాలిబన్లు అమెరికా, భారత్ , నాటోతో స్నేహహస్తం చాచడం ఊహించని పరిణామంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే శరవేగంగా మారుతున్న అప్ఘన్ రాజకీయ పరిణామాలపై స్పెషల్ ఫోకస్ వీడియో..