Homeజాతీయ వార్తలుRam Mohan Naidu Air India Mishap: యువనేతకు సవాళ్లు.. ఎలా ఎదుర్కొంటారో?

Ram Mohan Naidu Air India Mishap: యువనేతకు సవాళ్లు.. ఎలా ఎదుర్కొంటారో?

Ram Mohan Naidu Air India Mishap: కేంద్ర క్యాబినెట్ లో ఏపీకి సముచిత స్థానం దక్కింది. ఉత్తరాంధ్రకు చెందిన యువ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ( Ram Mohan Naidu) కేంద్ర పౌర విమానయాన శాఖ దక్కింది. నాలుగు పదుల వయసు దాటని ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సీఎం చంద్రబాబు వరకు రామ్మోహన్ నాయుడు పట్ల సానుకూలత ఉంది. పౌర విమానయాన శాఖలో కింజరాపు రామ్మోహన్ నాయుడు దూసుకుపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారీ విమాన ప్రమాదం జరగడం ఆ మంత్రిత్వ శాఖ నిర్వర్తిస్తున్న రామ్మోహన్ నాయుడుకు కాస్త ఇబ్బందికరమే. రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత పౌర విమానయాన శాఖ దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. విమాన ప్రయాణికుల సౌకర్యాలను పెద్దపీట వేస్తూ పౌర విమానయాన శాఖ తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరగడం విషాదం నింపింది.

అతిపెద్ద దుర్ఘటన
భారతదేశ పౌర విమానయాన చరిత్రలో ఇది అతి పెద్ద దుర్ఘటన. పౌర విమానయాన రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం( central government) చెబుతోంది. ప్రైవేటు రంగంలో సైతం విమానాల ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. దేశీయ అంతర్జాతీయ విమాన సేవలను అన్ని ప్రైవేటు రంగంలో సంస్థలు నిర్వహించగలుగుతున్నాయి. అయితే విమాన ప్రయాణికులకు సేవలందించడం కంటే లాభాలకు పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు నడిచే విమాన సేవలను కొన్ని ప్రైవేటు సంస్థలు నిలిపివేశాయి. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవ చూపారు. ప్రైవేటు సంస్థలతో మాట్లాడడం ద్వారా కొన్ని విమాన సర్వీసులను పునరుద్ధరించగలిగారు.

Also Read: Ahmedabad Flight Accident Air India: అహ్మదాబాద్ దారుణానికి ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే కారణమా? వెలుగులోకి సంచలన నిజం!

విమానాశ్రయ ఏర్పాటులో కృషి
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ( International Airport) పనులను త్వరితగతిన పూర్తి చేయడంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏపీకి పెద్ద ఎత్తున విమానాశ్రయాలను మంజూరు చేయడంలో కూడా విజయవంతం అయ్యారు. పర్యాటక రంగంలో విమానయాన సేవలను భాగస్వామ్యం చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ శాఖలో చాలా రకాల మార్పులు వచ్చాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అహ్మదాబాద్ లో భారీ విమాన ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనతో ప్రైవేటు సంస్థలు భద్రతాపరమైన అంశాలలో పూర్తిస్థాయి శ్రద్ధ పెడుతున్నాయా? అన్న అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. ముఖ్యంగా కాలం చెల్లిన విమానాలు, నిత్య తనిఖీలు లేవని స్పష్టమవుతోంది. పౌర విమానయాన శాఖకు ఇది సవాల్ గా మారుతుంది. సంబంధిత మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు పై ఒత్తిడి పెరుగుతోంది. అనేక రకాల సవాళ్లు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.

Also Read: Rammohan Naidu : లోకేష్ తో పాటు రామ్మోహన్ నాయుడు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

మంచి వాగ్దాటి గల నేత..
కింజరాపు రామ్మోహన్ నాయుడు దూకుడు కలిగిన నాయకుడు. మంచి వాగ్దాటి ఉన్న నేత. వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం( Srikakulam Lok Sabha constitution ) నుంచి పోటీ చేశారు. తండ్రి ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మూడుసార్లు గెలిచి జాతీయస్థాయిలో తన సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ వేదికల్లో సైతం ఆయన చురుగ్గా మాట్లాడేవారు. ఎర్రం నాయుడు కు జాతీయస్థాయిలో ఉన్న గుర్తింపు రామ్మోహన్ నాయుడుకు సైతం వర్తించింది. తండ్రికి మించిన తనయుడిగా గుర్తింపు పొందారు రామ్మోహన్ నాయుడు. అటువంటి యువనేత పౌర విమానయాన శాఖలో తనకు ఎదురవుతున్న సవాళ్లను ఎలా అధిగమిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version