Homeఆంధ్రప్రదేశ్‌Thalliki Vandanam Record: వామ్మో ఒకే కుటుంబంలో ఆరుగురికి.. తల్లికి వందనం రికార్డ్!

Thalliki Vandanam Record: వామ్మో ఒకే కుటుంబంలో ఆరుగురికి.. తల్లికి వందనం రికార్డ్!

Thalliki Vandanam Record:  ఏపీలో( Andhra Pradesh) తల్లికి వందనం రికార్డు సృష్టిస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందుతోంది. కొందరికైతే 50 వేల రూపాయలకు పైగా ఖాతాల్లో జమవుతోంది. దీంతో తల్లుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తాజాగా ఓ తల్లికి ఏకంగా 78 వేల రూపాయలు జమ అయ్యాయి. ఎందుకంటే ఆమెకు ఆరుగురు పిల్లలు. అందరూ స్కూలుకు వెళ్తున్న వారే. అయితే ఆరుగురికి ఎక్కడ తల్లికి వందనం పడుతుంది లే అనే అనుమానం ఉండేది. కానీ ఒక్కసారిగా 78 వేల రూపాయలు ఖాతాలో పడేసరికి.. తల్లికి వందనం పథకం వచ్చిందని ఆ కుటుంబం సంబరాలు మునిగిపోయింది. అయితే కొడుకు కోసం ఆగారు ఆ దంపతులు. అయితే ఈ క్రమంలో వారి సంతానం ఆరుగురికి పెరిగిపోయింది. కానీ చంద్రబాబు సర్కారు పుణ్యమా అని ఆ ఇంట పంట పండింది. ఒకవేళ కూటమి సర్కార్ వరుసగా నాలుగేళ్లపాటు ఈ పథకం అమలు చేస్తే మాత్రం.. ఆ కుటుంబానికి దక్కే లబ్ధి అక్షరాలా రూ.3.12 లక్షలు.

Also Read:  Thalliki vandanam Scheme Guidelines : తల్లికి వందనం అర్హతలు, మార్గదర్శకాలపై ఉత్కంఠ!

అప్పట్లో ఇంటికి ఒకరికే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం అమ్మ ఒడి అమలు చేసింది. కానీ ఇంటికి ఒకరికే పరిమితం చేసింది. ఈ క్రమంలో చాలా పేద కుటుంబాలకు పరిమిత సంఖ్యలోనే సాయం అందింది. అయితే ఓ పేద కుటుంబంలో ఆరుగురు పిల్లలకు గాను.. ఐదుగురికి తల్లికి వందనం పథకం వర్తించడం విశేషం. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాలాపురం గ్రామానికి చెందిన రత్నమ్మ, రామాంజనేయులు దంపతులకు ఆరుగురు సంతానం. కుమార్తెలు సుస్మిత, అక్షితలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. దివ్య అనే విద్యార్థిని ఆరో తరగతి చదువుతోంది, సాయి, మణికంఠ మూడో తరగతి చదువుతున్నారు. మరో కుమార్తె శాంతి ఒకటో తరగతి చదువుతోంది. అయితే ఇందులో శాంతికి మినహా మిగిలిన ఐదుగురికి తల్లికి వందనం పథకానికి ఎంపికయ్యారు. తల్లి రత్నమ్మ ఖాతాలో 65 వేల రూపాయలు జమ అయ్యింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత వైసిపి ప్రభుత్వం లో ఒకరికి మాత్రమే 13000 అందింది. ఇప్పుడు ఏకంగా ఒకే ఏడాది 65 వేల రూపాయలు అందు కోవడంతో ఆ పేద కుటుంబం కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే శాంతి ఒకటో తరగతి చదువుతున్నడంతో ఆమెకు సైతం మరో 13000 వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఆ కుటుంబానికి 78 వేల రూపాయల లబ్ధి చేకూరినట్టే.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా రత్నమ్మ( Ratnamma) తన ఆరుగురు పిల్లలతో టిడిపి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ కు రత్నమ్మ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆమె చెప్పారు. కాగా ఏకంగా ఆరుగురు పిల్లలకు లబ్ధి చేకూరేసరికి.. రత్నమ్మ దంపతులకు సన్మానించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version