Ahmedabad Flight Accident Air India: ఈ ప్రమాదం జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం నెలకొంది. ఈ క్రమంలో ఈ ప్రమాదాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతూనే.. ఈ ప్రమాదం వెనుక ఉన్న కారణాలను వెంటనే వెలికి తీయాలని కేంద్రం సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో ఒకవైపు సహాయక చర్యలు జరుగుతూ ఉండగానే.. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ మొదలైంది.. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది? ఉన్నట్టుండి విమానం ఎందుకు కూలిపోయింది? విమానం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు సరిగ్గా చూసుకోలేదా? విమానయాన సంస్థ బాధ్యులు దీనిని పట్టించుకోలేదా? పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? ఇంతటి ప్రమాదానికి కారణం ఎవరు? అనే కోణాలలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం గుజరాత్ ఆర్థిక రాజధాని నుంచి ఇంగ్లాండ్ రాజధానికి బయలుదేరిన విమానంలో లోపం ఉందని.. దీనివల్ల ఇబ్బంది తప్పదని ప్యాసింజర్ గుర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎయిర్ ఇండియా సంస్థకు అతడు అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లోపాన్ని సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
Also Read: టేక్ ఆఫ్ అయిన వెంటనే ఏం జరుగుతుంది? విమానాలు ఎందుకు కుప్పకూలిపోతాయి?
గుజరాత్ ఆర్థిక రాజధాని నుంచి టేక్ ఆఫ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. విమానంలో ఆ సమయంలో ఏకంగా 242 మంది ప్యాసింజర్లు ట్రావెల్ చేస్తున్నారు. ఆ ఫ్లైట్లో ఏదో ఫాల్ట్ ఉన్నట్టు ఒక ప్యాసింజర్ అంచనా వేశాడు. తన సందేహాన్ని ట్విట్టర్ ఎక్స్ వేదికగా విమానయాన సంస్థకు సమాచార రూపం లో అందించినట్లు తెలుస్తోంది.. ప్రమాదానికి గురైన ఫ్లైట్ దేశ రాజధాని నుంచి గుజరాత్ ఆర్థిక రాజధాని మీదుగా ఇంగ్లాండ్ రాజధాని కి చేరుకోవాలి. అయితే ఈ విమానాన్ని ఆకాశ్ అనే వ్యక్తి దేశ రాజధానిలో ఎక్కారు. ఆ తర్వాత అతడు అహ్మదాబాద్ లో దిగిపోయాడు. అయితే ఆ ఫ్లైట్ లో ఫాల్ట్ ఉందని అతడు ముందుగానే ఎయిర్ ఇండియా సంస్థకు సమాచారాన్ని అందించాడు. ఇక ఇదే విషయాన్ని ఆకాశం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
అయితే ఏడాది వ్యవధిలో ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తడం ఇది రెండవసారి. గత ఏడాది జూన్ 6న.. ఆ తర్వాత డిసెంబర్ నెలలో రెండుసార్లు ఈ విమానంలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఈ టెక్నికల్ ప్రాబ్లం పై ఎయిర్ ఇండియా కు పౌర విమానయాల శాఖ ఒక లెటర్ కూడా రాసింది. అయితే ఆ లెటర్ ను ఎయిర్ ఇండియా సంస్థ పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక ముచ్చటగా మూడోసారి గురువారం ఎయిర్ ఇండియా సంస్థ చెందిన అభిమానం ప్రమాదం బారిన పడింది. ఆ సమయంలో అహ్మదాబాద్ ప్రాంతంలో విమానం కుప్ప కూలింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 242 ప్యాసింజర్లు చనిపోయారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. అయితే చనిపోయిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారు. అయితే ఆయన తన కుటుంబ సభ్యులను కలవడానికి లండన్ వెలుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
Akash Vatsa @akku92 flew in the same Air India flight from Delhi to AMD 2 hours before it took off from #Ahmedabad and crashed #planecrash . He Noticed unusual things in the plane. Made a video to tweet to @airindia
— With Love Bihar (@WithLoveBihar) June 12, 2025