Rammohan Naidu : యూత్ లో ఎక్కువగా క్రేజ్ ఉన్న నాయకుల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు( Kinjarapu Ram Mohan Naidu ) ఒకరు. మంచి వాగ్దాటి, నడవడికతో యువతను ఆకట్టుకోవడంలో ముందున్నారు రామ్మోహన్ నాయుడు. అందుకే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం వీచినా నిలబడ్డారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టి లోక్ సభలో అడుగు పెట్టారు. అటు చంద్రబాబు నాయుడు కు దగ్గరగా ఉంటారు రామ్మోహన్ నాయుడు. దానికి కారణం దివంగత ఎర్రంనాయుడు. ఎంతటి కష్టంలో అయినా చంద్రబాబు వెన్నంటి నడిచారు ఎర్రం నాయుడు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. కుమారుడికి కేంద్రమంత్రి గాను.. తమ్ముడికి రాష్ట్ర మంత్రిగాను అవకాశం ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహస నిర్ణయమే. కానీ బలమైన నేపథ్యమున్న రాజకీయ కుటుంబం కావడం.. రామ్మోహన్ నాయుడు అవసరం పార్టీకి ఉండడం వంటి కారణాలతో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇప్పుడు లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రామ్మోహన్ నాయుడుకు సైతం కీలక పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది.
* జాతీయ ప్రధాన కార్యదర్శిగా..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు. గత రెండుసార్లు ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఆయనతో పాటు కింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం రెండుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు సైతం ప్రమోషన్ ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రామ్మోహన్ నాయుడుకు ఏ పదవి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టిడిపిలో కింజరాపు కుటుంబానికి ప్రత్యేక స్థానం. తండ్రి ఎర్రం నాయుడు అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పార్టీలో లోకేష్ తో సమన్వయం చేసుకోవడంలో రామ్మోహన్ నాయుడు ముందున్నారు. అందుకే భవిష్యత్తులో లోకేష్ కు అత్యంత అండగా నిలబడతారని భావించి రామ్మోహన్ నాయుడును ప్రమోట్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వారిద్దరూ జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కీలక పదవి కట్టబెట్టి మరింత బాధ్యతలు అప్పజెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : మంగ్లీని తోడ్కొని పోతావా? కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై టీడీపీలో ఫైరింగ్
* రామ్మోహన్ నాయుడు పాత్ర కీలకం మహానాడు( mahanadu) సభ నిర్వహణ, సక్సెస్ వెనుక రామ్మోహన్ నాయుడు పాత్ర కూడా ఉంది. టిడిపిలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ మహానాడు నిర్వహణ బాధ్యతలను రామ్మోహన్ నాయుడు కి అప్పగించడం ప్రత్యేక చర్చకు తావిచ్చింది. వాస్తవానికి రామ్మోహన్ నాయుడు సామర్థ్యం పై సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ కు అపార నమ్మకం. సభలో అందరి భావోద్వేగాలను అదుపు చేయడమే కాకుండా.. మహానాడు ను విజయవంతంగా పూర్తి చేయాలని రామ్మోహన్ నాయుడు పడే ఆకాంక్ష అందరికీ తెలిసిన విషయమే. అందుకే అదే మహానాడు వేదికగా రామ్మోహన్ నాయుడుకు పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది.
* పొలిట్ బ్యూరోలోకి..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన ఆయనకు కేంద్రమంత్రి పదవి వరించింది. దీంతో ఆయనకు మరింత బాధ్యత పెరిగింది. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు రామ్మోహన్ నాయుడుకు తెలుగు యువత అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే తెలుగు యువత కంటే పొలిట్ బ్యూరోలో తీసుకోవడమే ఉత్తమమని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.