సీత గురించి రాజమౌళితో ఆలియా ముచ్చట్లు !

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో క్రేజీ బ్యూటీ ఆలియా భట్, చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆలియా భట్ ఈ రోజు ఈ సినిమా షూట్ లో పాల్గొంది. దాదాపు సంవత్సరం తరువాత ఆలియా ఆర్ఆర్ఆర్ టీమ్ తో జాయిన్ అవ్వడం విశేషం. పైగా ఆలియా ఈ లాక్ డౌన్ లో ఈ సినిమా కోసం […]

Written By: Neelambaram, Updated On : December 7, 2020 7:57 pm
Follow us on


నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’లో క్రేజీ బ్యూటీ ఆలియా భట్, చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆలియా భట్ ఈ రోజు ఈ సినిమా షూట్ లో పాల్గొంది. దాదాపు సంవత్సరం తరువాత ఆలియా ఆర్ఆర్ఆర్ టీమ్ తో జాయిన్ అవ్వడం విశేషం. పైగా ఆలియా ఈ లాక్ డౌన్ లో ఈ సినిమా కోసం తెలుగును కూడా నేర్చుకుందట. ప్రస్తుతం రాజమౌళి దగ్గర సీత పాత్రకు సంబంధించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకుంటుందట. ఆ మధ్య సోషల్ మీడియాలో ఈ సినిమా నుంచి అలియా భట్ తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది.

Also Read: పవన్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ ఎప్పుడంటే !

కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అలాగే ఆర్ఆర్అర్ షూటింగ్ డేట్స్ మారడం వల్ల ఆలియా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ ఆలియా ఈ సినిమా నుండి తప్పుకోలేదని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పైగా ఈ రోజు ఏకంగా షూట్ లోనే పాల్గొంది. అన్నట్టు రేపటి నుండి అజేయ్ దేవగన్ కూడా షూట్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో అజేయ్ దేవగన్ రోల్ వస్తోందట. ఎక్కువుగా ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే ఆయన సీన్స్ ఉంటాయట. ఇక ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె పై ఇప్పటికే షూట్ చేశారు.

Also Read: మోనాల్ కోసం అవినాష్‌ బలి.. బిగ్ బాస్ పక్షపాత ధోరణి !

కాగా సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అన్ని సాంగ్స్ కీరవాణి ఇప్పటికే పూర్తి చేశాడట. ఏది ఏమైనా ‘బాహుబలి’ సిరీస్ అనంతరం రాజమౌళి నుండి వస్తున్న ప్రాజెక్ట్ కావడం, పైగా ఇద్దరు స్టార్ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన హీరోల టీజర్స్ కూడా ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్