https://oktelugu.com/

రజినీకాంత్ సంచలనం: పార్టీ పేరు, గుర్తు ఖరారు.. ఇవే?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు మాత్రమే సమయం ఉండడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచారు. తన పార్టీ పేరును, గుర్తును ఖరారు చేసినట్టు సమాచారం. రజినీకాంత్ పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ’ (ప్రజాసేవా పార్టీ) అని పేరు పెట్టినట్టు తెలిసింది. అలాగే తన పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘ఆటో’ను ఎంచుకున్నట్టు సమాచారం. Also Read: రైతుల ఆందోళన: యాంటీ మోడీ.. జియోకు భారీ దెబ్బ? రజనీకాంత్ తో ‘ఆటోరిక్షా’కు అవినాభావ సంబంధం ఉంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2020 / 11:01 AM IST
    Follow us on

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలలు మాత్రమే సమయం ఉండడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచారు. తన పార్టీ పేరును, గుర్తును ఖరారు చేసినట్టు సమాచారం. రజినీకాంత్ పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ’ (ప్రజాసేవా పార్టీ) అని పేరు పెట్టినట్టు తెలిసింది. అలాగే తన పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘ఆటో’ను ఎంచుకున్నట్టు సమాచారం.

    Also Read: రైతుల ఆందోళన: యాంటీ మోడీ.. జియోకు భారీ దెబ్బ?

    రజనీకాంత్ తో ‘ఆటోరిక్షా’కు అవినాభావ సంబంధం ఉంది. ఆటోను తనకు అచ్చొచ్చిన వాహనంగా రజినీకాంత్ భావిస్తాడు. 90 వ దశకంలో రజినీ సినీ జీవితంలోనే అతిపెద్ద హిట్ చిత్రం‘బాషా’లో ఆటో డ్రైవర్‌గా చేసి రికార్డులు సృష్టించాడు. ఈ ఆటో మధ్యతరగతి ప్రజలలో ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందిన గుర్తు. స్వతహాగా మాస్ హీరో అయిన రజినీకాంత్ కు ఈ గుర్తు బాగా సరిపోతుందని సమాచారం.

    Also Read: కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్స్: ఏపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్జిస్ ల బదిలీలు?

    అయితే రజినీకాంత్ మొదట తన ఎన్నికల గుర్తుగా ‘బాబా లోగో’ను అడిగారని.. కానీ ఎన్నికల సంఘం దాన్ని నిరాకరించిందని సమాచారం. ఇక సైకిల్ ను ఎన్నికల గుర్తుగా అనుకొని చివరకు తనకు సెంటిమెంట్ అయిన ‘ఆటో’ను ఎంచుకున్నట్టు తెలిసింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    రజినీకాంత్ తన రాజకీయ పార్టీ పేరు ‘మక్కల్ సేవై కర్చి’గా.. తన పార్టీ ఎన్నికల గుర్తుగా ‘ఆటో రిక్షా’ను పోల్ సింబల్‌ను కేటాయించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ)కి లేఖ రాశారు. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. రజినీకాంత్ పార్టీ ప్రకటించే డిసెంబర్ 31 న అధికారిక ప్రకటన వెలువడనుంది.