https://oktelugu.com/

బిగ్‌బాస్ విజేత ఎవరు? చివరి వారంలో ఓట్లు.. ఎవరికి ఎంత అంటే!

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ విన్నర్ ఎవరో కొన్నిరోజుల్లో తేలిపోనుంది. అయితే ఓటింగ్ విషయానికి వస్తే… అభిజిత్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకూ పోలైన ఓట్లలో అభిజిత్‌కు 50 నుంచి 55 శాతం, అరియానాకు 15 నుంచి 20 శాతం మధ్య, సోహెల్‌కు 10 నుంచి 14 శాతం మధ్య, అఖిల్‌కు 10 నుంచి 15 శాతం మధ్య, హారికకు 5 […]

Written By:
  • admin
  • , Updated On : December 15, 2020 / 11:02 AM IST
    Follow us on


    బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టైటిల్ విన్నర్ ఎవరో కొన్నిరోజుల్లో తేలిపోనుంది. అయితే ఓటింగ్ విషయానికి వస్తే… అభిజిత్ టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకూ పోలైన ఓట్లలో అభిజిత్‌కు 50 నుంచి 55 శాతం, అరియానాకు 15 నుంచి 20 శాతం మధ్య, సోహెల్‌కు 10 నుంచి 14 శాతం మధ్య, అఖిల్‌కు 10 నుంచి 15 శాతం మధ్య, హారికకు 5 నుంచి 10 శాతం మధ్య ఓట్లు పోలైనట్టు సమాచారం. దీనిబట్టి సీజన్ 4 విన్నర్‌గా అభిజీత్ నే నిలవడం ఖాయం అని ఈ పాటికే అందరికీ అర్ధం అయింది.

    Also Read: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సరికొత్త రికార్డ్ !

    అయితే, బిగ్ రియాలిటీ షోలో ఏమైనా జరగొచ్చు. బిగ్ బాస్ చివర్లో కూడా ట్విస్ట్ లు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికీ అందరికీ ఉన్న ప్రశ్న ఒక్కటే.. సీజన్ 4 విన్నర్‌గా ఎవరు నిలుస్తారని.. ? సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. కంటెస్టెంట్ ల టీమ్స్ ఎవరికీ వారు విన్నర్ గా నిలుస్తామని ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ రేస్‌లో అభిజీత్ ముందువరుసలో ఉన్నాడు కాబట్టి.. టైటిల్ గెలవడానికి అతనికే ఎక్కువ ఛాన్స్ లు ఉన్నాయి. అరియానా, సోహెల్, హారిక, అఖిల్ కు ఓట్లు కూడా తక్కువగా పడటంతో వారు పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు.

    Also Read: బిగ్ బాస్ లో 14 వారాలకు మోనాల్ గజ్జర్ రెమ్యుూనరేషన్ ఇంతనా?

    దీనికితోడు సెలబ్రిటీలు కూడా అభిజీత్ కే సపోర్ట్ చేస్తుండటం కూడా అతనికి బాగా కలిసొచ్చింది. ఇప్పటికే నాగ‌బాబు, శ్రీకాంత్ లాంటి స్టార్స్ అభిజీత్‌కి బాహాటంగానే మద్దతు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెట్టారు. అలాగే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో కూడా అభిజిత్ కి పరోక్షంగా తన మద్దతు పలుకుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టడంతో.. విజయ్ ఫ్యాన్స్ కూడా అభిజీత్ కే ఓట్లు వేసినట్టు ఉన్నారు. అభిజిత్ హీరోగా వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్’ సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న రోల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే విజయ్ సపోర్ట్ చేశాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్